పోలవరం జిల్లాలో ‘పెద్దపులి’ సంచారం – Visalaandhra


పోలవరం: జిల్లాలోని దేవీపట్నం మండలం గంగపాలెంలో పెద్దపులి సంచారం కలలం రేపింది. మంగళవారం రాత్రి పశువులపై దాడి చేసిన పులి…14 దూడలు, ఒక గేదెను హతమార్చింది. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఎక్కువ సంఖ్యలో పశువులను పెంచడంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో…మైదాన ప్రాంతల నుంచి గండి పోచమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే భక్తులను పోతవరం వద్ద అటవీ శాఖ అధికారులు నిలిపివేస్తున్నారు. గ్రామస్తులు ఒంటరిగా బయటకు రాకూడదని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. టెలీ కాలర్ ఆధారంగా పులి జాడ కోసం సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నాలుగు ప్రత్యేక బృందాలు వచ్చాయన్నారు. త్వరలోనే పులిని బంధిస్తామని స్థానిక గ్రామ ప్రజలకు అటవీ అధికారులు చెప్పారు. బయట పనులకు వెళ్లేటప్ప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమÖహంగా బయటకు వెళ్లాలన్నారు. పులి కనిపిస్తే వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *