బ్యాలెట్ బాక్స్‌లు తెరిచేందుకు కుట్రలు: తృణమూల్
కోల్‌కతా: గత నెలలో జరిగిన ఎన్నికల్లో బెంగాల్ ఎన్నికలపై అందరి దష్టి ఉంది. అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ…ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. పలుచోట్ల స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌లను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈవీఎంలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియను తారుమారు చేయాలని చూస్తే… చావునైనా లెక్క చేయకుండా పోరాడతానని హెచ్చరించారు. దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో…


