AP Weather: నేడు రాయలసీమకు వర్ష సూచన.. నిప్పుల కొలిమిలా కోస్తాంధ్రా.. ఏపీ వాతావరణ తాజా అప్‌డేట్స్.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

AP Weather: ఆంధ్రప్రదేశ్ లో ఎండ తీవ్రత పెరుగుతోంది, 22 జిల్లాల 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా, రాయలపేటలో 43.7, ప్రజలు వడగాలులు, ఉక్కపోతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

News18
News18

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. బుధవారం చిత్తూరు జిల్లా రాయలపేటలో 43.7 డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే 28 జిల్లాలకు గాను 22 జిల్లాల పరిధిలోని 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు.

గురువారం (14-05-26) రాష్ట్రంలో గరిష్ఠంగా 43-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. అల్లూరి జిల్లా జికే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, గుర్తేడు మండలాల్లో(4) వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శుక్రవారం 01 తీవ్ర, 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో రేపు, ఎల్లుండి రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

బుధవారం చిత్తూరు(జి) రాయలపేటలో 43.7°C, నంద్యాల(జి) దొర్నిపాడులో 42.6°C,కర్నూలు(జి) నగరడోనలో 42.5°C, వైఎస్సార్ కడప(జి) కలసపాడులో 42°C, మర్కాపురం(జి) కంభంలో 41.9°C, కృష్ణా(జి) ఉయ్యూరు, ఎన్టీఆర్(జి) తొర్రగుడిపాడులో 41.8°C, అనకాపల్లి(జి) దేవరపల్లిలో 41.3°C,  అనంతపురం(జి)  భట్టువానిపల్లి, పల్నాడు(జి) బెల్లంకొండ, శ్రీసత్యసాయి(జి) దాడితోటలో 41.2°C,  నెల్లూరు(జి) మర్రిపాడులో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *