AP Tourism: పర్యాటకులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. వైజాగ్ వెళ్తున్నారా.. అయితే ఇకపై రాపిడో డ్రైవరే మీ టూరిస్ట్ గైడ్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

AP Tourism: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీటీడీసీ, రాపిడో కలిసి విశాఖలో డ్రైవర్ కం టూరిస్ట్ గైడ్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం, 350 డ్రైవర్లకు శిక్షణ, యాప్‌లో కొత్త ఐకాన్ ద్వారా బుకింగ్.

+

News18

News18

ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక సంస్థ ఏపీటీడీసీ(aptdc) , రాపిడో (Rapido) సంస్థ సంయుక్తంగా దేశంలోనే మొదటిసారిగా డ్రైవర్ కం గైడ్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి విశాఖ వచ్చిన వారికి రైల్వే స్టేషన్, ఏయిర్‌పోర్ట్, బస్ స్టేషన్ నుంచి నేరుగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సరికొత్త డ్రైవర్ కం గైడ్ కార్యక్రమం తీసుకువచ్చింది. పర్యాటకులు కోరిన ప్రదేశాలకి తీసుకెళ్లి ఆ ప్రాంత చరిత్రను తెలిపే విధంగా ఈ రాపిడో డ్రైవర్లను తయారు చేస్తుంది. డ్రైవర్ కం టూరిస్ట్ గైడ్ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో రాపిడో డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇది మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది.

విశాఖ వచ్చే పర్యాటకులకు టూరిస్ట్ గైడ్లు త్వరలో అందుబాటులోకి రానున్నారు. పర్యాటకులు తమకు నచ్చిన ప్రాంతాలకు ఈ డ్రైవర్ కం గైడ్ తీసుకువెళ్లి ఆ ప్రదేశం చరిత్ర వివరిస్తారు. రాష్ట్ర పర్యాటక సంస్థ , రాపిడో సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. డ్రైవర్ కం గైడ్ కార్యక్రమం విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభించారు. దీనికోసం రాపిడో లో నైపుణ్యం కలిగిన 350 మంది డ్రైవర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. కారు, ఆటో డ్రైవర్లను ప్రత్యేకంగా ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా విజయవాడలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈ పైలట్ ప్రాజెక్ట్, విశాఖలో కూడా ప్రారంభించారు తర్వాత తిరుపతిలో ప్రారంభిస్తామని తెలిపారు.

రాపిడో యాప్‌లో టూరిస్ట్ గైడ్ మరొక ఐకాన్ అందుబాటులోకి వస్తుంది. ఈ యాప్‌లో ఐకాన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్యాటకులు తాము చూడవలసిన ప్రాంతాన్ని ఎంచుకుంటే వాటి వివరాలు ఎంత ప్యాకేజీ రేటు కనిపిస్తుందని తెలిపారు. యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్యాటకులతో ఎలా ఉండాలి అని ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం వచ్చిన తర్వాత పర్యాటక ప్రాంతాలు గురించి తెలియకపోయినా ఈ గైడ్లు తీసుకెళ్లి చూపించి తమ గమ్య స్థానంలో దించుతారని అంటున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *