Amaravati Capital: కాణిపాకం వరసిద్దివినాయకుడికి అమరావతి రైతుల మొక్కులు.. నెక్స్ట్ ఆ టెంపుల్‌కే పయనం | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

Amaravati Capital: ఆ మధ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అమరావతి ప్రాంత రైతులు,మహిళలు ఇప్పుడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూగా వెలసిన శ్రీవరసిద్దివినాయకస్వామిని దర్శించుకున్నారు.

Amaravati capital
Amaravati capital

Amaravati Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని భావించింది. అందుకు అనుగూణంగానే పార్లమెంట్‌లో అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంత ప్రజలు, కోస్తాంధ్ర వాసులు రాజధాని ఒకటి ఉంటుందా లేక మూడు రాజధానులు ఉంటుందా అనే సందేహాలకు తెర పడినట్లైంది. అలాగే రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంత ప్రజలు సుమారు 34వేల ఎకరాలను భూములు ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని.. విడిపోయిన ఆంధ్రరాష్ట్రం అభవృద్దిలో దూసుకెళ్లాలని భావించారు. అయితే ఆ కోరిక ఇప్పటికి సాధ్యమైనట్లుగా అమరావతి ప్రాంత ప్రజలు రైతులు భావిస్తున్నారు. అందుకే దేవాలయాల బాటపడుతున్నారు. ఇందులో భాగంగానే అమరావతి ప్రాంత రైతులు,మహిళలు చిత్తూరు జిల్లా  కాణిపాకంలోని స్వయంభూగా వెలసిన శ్రీవరసిద్దివినాయకస్వామిని దర్శించుకున్నారు.అమరావతి ప్రాంత రైతులకు ఆలయ అధికారులు, స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు.

రాజధాని ముక్కులు..

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం జరగకపోగా.. టీడీపీ హయాంలో చేపట్టిన పనులు కూడా ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. అయితే మూడు రాజధానుల నినాదంతో వైసీపీ అమరావతిని శాసన రాజధాని(లెజిస్లేటివ్ క్యాపిటల్) మాత్రమే భావించింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వం రాజధాని అమరావతి చట్టబద్దత కల్పించింది. ఈపరిణామాన్ని స్వాగతించడమే కాకుండా ఆ ప్రాంత రైతులు, మహిళలు తమ కల సాకారం కాబోతోందని భావిస్తున్నారు. ఇందులో భాగం9గానే ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని అమరావతి రైతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ చైర్మన్ సురేంద్రబాబు ఆలయ ఈవో పెంచల కిషోర్ ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి స్వామి వారి శేష వస్త్రం తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు.

మిగిలింది అరుణాచలమే..

అనంతరం అమరావతి రైతులు మీడియాతో మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కాణిపాకంలో ప్రత్యేక పూజలు చేసినట్లు వారికి ఇన్ని రోజులు పడ్డ కష్టానికి అమరావతికి చట్ట బద్ధత కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో అమరావతి కి చట్టబద్ధత కల్పించి రాజధానిగా ప్రకటిస్తే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కాణిపాకం అరుణాచలం ఆలయాల సందర్శించాలని మొక్కుకున్నారని అమరావతి చట్టబద్ధత కల్పించినందుకు మొక్కులు తీర్చుకోవడానికి కాణిపాకం వచ్చామని ముందుగా కాణిపాకం విఘ్నేశ్వరుడు మాకు ఎటువంటి విజ్ఞాన కలగకుండా ఉండేందుకు తిరిగి అమరావతికి వెళ్లే వరకు క్షేమంగా ఉండాలని వినాయకుని కోరుకున్నట్లు తెలిపారు. అమరావతి బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా కాణిపాకం వినాయక స్వామి దర్శించుకున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *