Last Updated:
Tirupati: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు నిత్యం ఏదో ఓ చోట రక్తంతో తడిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన యాక్సిడెంట్‌లో నలుగురు మృత్యువాత పడ్డారు.
Tirupati: తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు నిత్యం ఏదో ఓ చోట రక్తంతో తడిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన యాక్సిడెంట్‌లో నలుగురు మృత్యువాత పడ్డారు. శ్రీకాళహస్తి పట్టణం సమీపంలోనే ఊరందురు హైవే రోడ్డుపై తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో మరో ఇద్దరికి తీవ్రంగా గాయలయ్యాయి. వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని ఊరందూరు హైవే రోడ్డుపై తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డీఎస్పీ నరసింహమూర్తి అందించిన వివరాల ప్రకారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెస్ట్ బెంగాల్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న అంబులెన్స్ అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో మొత్తం ఆరుగురు ఉండగా, వారిలో ముగ్గురు పురుషులు ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుని, క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాల నుంచి మృతదేహాలను వెలికి తీశారు. గాయపడిన ఇద్దరిని తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirupati,Chittoor,Andhra Pradesh



