Last Updated:
Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ఉత్కంఠ భరిత కౌంటింగ్ తర్వాత మల్లాడి కృష్ణారావు, సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్‌పై 5568 ఓట్ల మెజార్టీతో గెలిచి విజయకేతనం ఎగరేశారు
కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఉత్కంఠ భరితంగా ఎన్నికల కౌంటింగ్ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ నడిచింది. ప్రారంభంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సైతం అధికంగా నమోదు అయ్యాయి, అక్కడ నువ్వా నేనా అనే విధంగా ఇద్దరు పంచుకున్న పరిస్థితి నెలకొంది.
అయితే మొదటి, రెండవ రౌండ్లో కాస్త సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ముందంజలో ఉన్నప్పటికీ, మూడవ రౌండ్ రీకౌంటింగ్ ముగిసేసరికే స్వల్ప ముందంజలో మల్లాడి కృష్ణారావు ఉన్న పరిస్థితి నెలకొంది. దీంతో 4, 5 రౌండ్లలో కృష్ణారావు దూసుకుపోయిన పరిస్థితి నెలకొంది మొత్తానికి యానం ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారంటూ సంబరాలు చేసుకుంటున్నారు, ఇంతకీ యానంలో గెలుపు ఎవరిది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి క్లుప్తంగా చూద్దాం
కేంద్ర పాలిత ప్రాంతమైన యానం ప్రశాంతతకు మారుపేరు అని చెప్పుకోవచ్చు. ఏపీలోని కాకినాడకు అతి దగ్గరగా ఉన్న నగరంగా చెప్పుకోవచ్చు. అభివృద్ధిలోనూ అన్ని విషయాల్లోనూ యానం ముందంజలో ఉంటుంది. ఏపీ అంతా ఒక రకమైన రేట్లు అయితే ఇక్కడ యానంలో అందుకు భిన్నంగా తక్కువ రేట్లు ఉంటాయి.
ఏది ఏమైనా యానంలో ఎలక్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గొల్లపల్లి అశోక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేయగా, (AINRC) కాంగ్రెస్ నుంచి మల్లాడి కృష్ణారావు పోటీ చేశారు, నిజానికి ఇద్దరు యానం ప్రాంతానికి సుపరిచితులేనని చెప్పుకోవచ్చు. దాదాపు 5 రౌండ్లలోనే ఫలితం తేలే అవకాశం ఉందని అధికారులు ఏ విధంగా అయితే ముందస్తుగా అంచనా వేసారో అదే విధంగా ఇక్కడ ఫలితం తేలిపోయిందని చెప్పుకోవచ్చు.
కౌంటింగ్ ప్రారంభం నుంచి గొల్లపల్లి అశోక్ అదేవిధంగా మల్లాడి కృష్ణారావు మధ్య ఉత్కంఠ భరితమైన పోటీ నెలకుందని చెప్పుకోవచ్చు, పోస్టల్ బ్యాలెట్ మొదలు రౌండ్ రౌండ్‌కి నువ్వా నేనా అనే విధంగా పోటీ నెలకుంది. అయితే మూడవ రౌండ్ వచ్చేసరికి స్వల్పంగా మల్లాడి కృష్ణారావు ఆధిక్యంలో ఉన్నారు.
అక్కడి నుంచి నాలుగు ఐదు రౌండ్లలో వచ్చిన మెజార్టీ అత్యధికంగా మల్లాడి కృష్ణారావుకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కేంద్రపాలిత ప్రాంతం యానంలో మల్లాడి కృష్ణారావు విజయకేతనం ఎగరవేశారు. ప్రత్యర్థి గొల్లపల్లి అశోక్ పై 5568 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగరవేసినట్లుగా స్పష్టమవుతుంది. దీంతో యానంలో మల్లాడి అభిమానులు సందడి చేసుకుంటున్నారు.
యానం పరిస్థితి చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ యువకుడు ఉత్సాహవంతుడని గతంలో ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. అయితే గత ఐదేళ్లలో ఆయన చేసిన అభివృద్ధి చూసి ప్రజలు తీర్పు ఈ విధంగా ఇచ్చారంటూ మల్లాడి కృష్ణారావు వర్గీయులు అభిమానులు చెబుతున్నారు. ఏది ఏమైనా యానం అభివృద్ధి అంటే మల్లాడి కృష్ణారావుదే అంటూ అభిమానులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


