Anganwadi Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. చివరి తేదీ ఇవే! | చిత్తూరు వార్తలు (Chittoor News)
ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నియామక ప్రక్రియకు సంబంధించి గంగాధరనెల్లూరు ప్రాజెక్టు పరిధిలోనే 40 అంగన్వాడీ సహాయకురాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీడీపీవో పద్మ సునంద తెలిపారు. గంగాధరనెల్లూరు, పెనుమూరు, పాలసముద్రం మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. కలిజవేడు, అరవచేనుపల్లె, మేనాటంపల్లె, గోవిందరెడ్డిపల్లె, సర్విరెడ్డిపల్లె, ఆరిమాకులపల్లె, పద్మాపురం, ఒడ్డుపల్లె, బోడపూరు, తూగుండ్రం, కోటాగరం, తిరువీధికుప్పం తదితర గ్రామాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే పెనుమూరు మండలంలోని తలారిపల్లె, విడిదిపల్లె, సామిరెడ్డిపల్లె ఎస్టీ…


