Annavaram Temple Kalyanam: నేత్రపర్వంగా అన్నవరం సత్యదేవుని కల్యాణం.. కన్నులు చేసుకున్న పుణ్యం అంటున్న భక్తులు |


Last Updated:

Satyanarayana Swamy Kalyana: అన్నవరం రత్నగిరి కొండలపై అనంతలక్ష్మీ సత్యవతి దేవికి శ్రీ సత్యనారాయణ స్వామివారికి అత్యంత ఘనంగా కళ్యాణం జరిగింది. చూడగలమా మరలా ఇంతటి వైభోగ కళ్యాణం అనే విధంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి,వార్షిక కళ్యాణ మహోత్సవాలు దేవాదాయ ధర్మదాయ శాఖ అత్యంత ఘనంగా ఏకాదశి రోజు నిర్వహించింది.

+

Annavaram

Annavaram Temple Kalyanam

Satyanarayana Swamy Kalyana: అన్నవరం రత్నగిరి కొండలపై అనంతలక్ష్మీ సత్యవతి దేవికి శ్రీ సత్యనారాయణ స్వామివారికి అత్యంత ఘనంగా కళ్యాణం జరిగింది. చూడగలమా మరలా ఇంతటి వైభోగ కళ్యాణం అనే విధంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి,వార్షిక కళ్యాణ మహోత్సవాలు దేవాదాయ ధర్మదాయ శాఖ అత్యంత ఘనంగా ఏకాదశి రోజు నిర్వహించింది. కళ్ళు మిర్మిట్లు కమ్మే విద్యుత్ కాంతులు, దైవతామూర్తుల వేషధారణలు, విఐపి ల రాక, లక్షలాదిగా వచ్చిన భక్తజనుల  నడుమ కళ్యాణం కమనీయంగా జరిగింది. ఒకసారి అన్నవరం కళ్యాణ మహోత్సవ వివరాలు క్లుప్తంగా చూద్దాం.

సత్యదేవిని కల్యాణం..

తెలుగు రాష్ట్రాల్లోనే ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రం ఏడాదిలో ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం తోనే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అటువంటి దివ్య క్షేత్రంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఏడాదికి ఒకసారి అత్యంత ఘనంగా దేవస్థానం నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఏకాదశి పర్వదినాన నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి ఇసుక వేస్తే రాలని విధంగా భక్త జనులు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి సైతం హాజరయ్యారు.

రత్నగిరి కొండతో పాటు అన్నవరం గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ..

స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా అన్నవరం గ్రామంలో పండుగ మించి వాతావరణం నెలకోంది. ఇలా వారం రోజులుగా ఈప్రాంతంలో సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అన్నవరం ప్రధాన రహదారి గుండా ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులు, ముఖ్యంగా ప్రత్యేక కార్యక్రమాలు, అంతకుమించి దైవతమూర్తుల వేషధారణలు, ప్రత్యేక ఆధ్యాత్మిక నృత్యాలు, రోజుకు ఒక కార్యక్రమం అన్నవరం గ్రామ వాసులను అలరిస్తుందని చెప్పుకోవచ్చు.

నేత్రపర్వంగా..

ఏకాదశి పర్వదినం రత్నగిరి కొండలపై నిర్వహించిన శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారి కళ్యాణం, చూడగలమా మరలా అనే విధంగా దేవస్థానం నిర్వహించింది. దేవస్థానం కార్యనిర్వాహన అధికారి చక్రధర్ రావు, చైర్మన్ రోహిత్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్నత అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరై స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించి ఆధ్యాత్మిక పరవశ్యం చెందారు.

దైవతామూర్తుల కళ్యాణానికి ఉన్న విశిష్టత ఇదే

సాధారణ కళ్యాణానికి దైవదామూర్తుల కళ్యాణానికి తేడా ఉంటుందని చెప్పుకోవచ్చు. స్వామివారికి కళ్యాణానికి జరిగే తంతులు అంటే గణపతి పూజ, పుణ్యహవచనం,కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల ఘట్టాలు అంటే ఏంటి అన్న అర్ధాన్ని క్లుప్తంగా వివరిస్తూ ఆ తంతును దైవతామూర్తుల కళ్యాణంలో చెబుతూ ఉంటారు, అన్నవరంలో జరిగిన కళ్యాణంలో భాగంగా ప్రతి విషయాన్ని లక్షలాది భక్తులకు వివరిస్తూ కళ్యాణం కమనీయంగా ఈఏడాది సైతం నిర్వహించారు. భక్తజనులు గోవింద నామాలు జపిస్తూ స్వామివారి కల్యాణాన్ని కనులారా తొలగించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *