పొన్నూరు: దోపిడీ దొంగల ముఠాపై జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పొన్నూరు మండలం నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. వారి చేతిలో వైర్లు కత్తిరించే సామగ్రి ఉండటంతో పోలీసులు పట్టుకోవటానికి యత్నించారు. వెంటనే దుండగులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు.. దుండగులపై కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. మంగళవారం తెల్లవారుజామున దాదాపు 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
Source link
Guntur | గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం


