గొట్లూరు సింగల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యము అని గొట్లూరు సింగిల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం రూరల్ మండలం ఓబుల్ నాయనపల్లి గ్రామంలో రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఆదేశాల మేరకు, పరిటాల శ్రీరామ్ సూచనలతో పేదల సేవలో భాగంగా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోట్లూరు సింగిల్ విండో చైర్మన్ మేకల రామాంజనేయులు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. గ్రామంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర పింఛన్ లబ్ధిదారులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మేకల రామాంజనేయులు మాట్లాడుతూ… ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబుల్ నాయనపల్లి గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పింఛన్ పంపిణీ కార్యక్రమం సజావుగా సాగడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.


