ప్రజల అర్జీలకు ప్రాధాన్యం – సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం


మంత్రి పయ్యావుల కేశవ్

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాదర్బార్ నిర్వహించి, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున హాజరైన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, ప్రజల నుంచి నేరుగా సమస్యలను స్వీకరించి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి, వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
కౌకుంట్లలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అందిన ప్రతి అర్జీపై వేగంగా స్పందించి, ఎలాంటి ఆలస్యం లేకుండా సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *