అర్హులైన రైతులకు నాణ్యమైన విత్తనకాయలు – Visalaandhra


-ఎమ్మెల్యే పరిటాల సునీత

​విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : అర్హులైన రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రాప్తాడులో రైతులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్న విత్తన వేరుశనగ కాయల నాణ్యతను సునీత గురువారం స్వయంగా పరిశీలించారు. విత్తన గింజల నాణ్యతను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ కృష్ణచైతన్య, తహశీల్దార్ చెన్నకేశవులు, టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శీనా, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గంగలకుంట కృష్ణ, ఎంపీటీసీ జాఫర్, సీసీ రాము, ఏఈఓలు సుజిత, రంజిత, ఎంపీఈఓ రాజు, వీహెచ్ఎలు గిరి, సోనీ, భారతి, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *