తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాల్లోని పరిస్థితులను అధికారులు క్షణక్షణం గమనిస్తున్నారు. వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలు, రద్దీ తీవ్రత, క్యూ లైన్ల ప్రవాహాన్ని విశ్లేషిస్తూ అవసరమైన నిర్ణయాలను వెంటనే అమలు చేస్తున్నారు. ఈ డిజిటల్ మానిటరింగ్ కారణంగా రద్దీ నియంత్రణ మరింత వేగంగా, సమన్వయంతో కొనసాగుతోంది.



