డీజిల్ ధరలపై విశాఖలో ఆటో కార్మికుల ఆగ్రహం.. రోడ్డెక్కిన యూనియన్లు..! Visakhapatnam auto workers protest | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

విశాఖలో ఆటో కార్మికులు డీజిల్ ధరల పెంపు, మహిళల ఉచిత బస్సు పథకంపై నిరసన, కే. సత్యన్నారాయణ నేతృత్వంలో ధరలు తగ్గించాలి, ఆటోలకు ప్రత్యేక సహాయం ఇవ్వాలని డిమాండ్

+

News18

News18

విశాఖ నగరంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. రోజురోజుకీ పెరుగుతున్న డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికే జీవనోపాధి కష్టాల్లో ఉన్న సమయంలో డీజిల్ ధరల పెంపు తమను పూర్తిగా కుదేలు చేస్తోందని మండిపడ్డారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకుడు కే. సత్యన్నారాయణ పాల్గొని ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా ఆటోలకు ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోయారని ఆయన పేర్కొన్నారు. రోజంతా ఆటో నడిపినా సరైన ఆదాయం రావడం లేదని, ఇప్పుడు డీజిల్ ధరల భారం మరింత పెరగడంతో ఆటో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడినా వచ్చే సంపాదన అంతా డీజిల్‌కే సరిపోతోంది. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను ఎలా పోషించాలి? అంటూ ఆటో డ్రైవర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆటో నడపడం కంటే కుటుంబాన్ని నెట్టుకురావడమే పెద్ద సవాల్‌గా మారిందని వాపోయారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలని, ఆటో రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో అన్ని ఆటో యూనియన్లను ఏకం చేసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అవసరమైతే నగరవ్యాప్తంగా ఆటోల బంద్‌కు కూడా పిలుపునిస్తామని ఆటో కార్మికులు స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖలో జరిగిన ఈ నిరసన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్య ప్రజలతో పాటు చిన్నచిన్న ఉపాధులపై ఆధారపడిన కార్మిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *