కొలతల ప్రకారమే వేతనాలు..ఏపీఓ దయాసాగర్


విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : ఉపాధిహామీ పథకంలో కొలతలప్రకారమే వేతనాలు ఉంటాయని ఏపీఓ దయాసాగర్ అన్నారు. శుక్రవారం వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామ పంచాయతీ లో జరుగుచున్న ఉపాధిహామీ పనులను ఏపీఓ దయాసాగర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కూలీల హాజరును స్వయంగా పరిశీలించారు.ముందుగా ఎన్ ఎం ఎం ఎస్ యాప్ ద్వారా నమోదు అయిన కూలీల హాజరును క్షేత్రస్థాయిలో ఉన్న కూలీల సంఖ్యతో సరిచూశారు. అనంతరం పనుల నాణ్యతను కొలతలను పర్యవేక్షించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉపాధి కూలీలు అందరూ ప్రతిరోజూ ఉదయం 6.00 గంటలలోపు పనికి వచ్చి 9:00గంటలకల్లా మీకు కేటాయించిన పనిని పూర్తి చేసుకొని ఇంటికి పోవాలని అన్నారు . ఉపాధి కూలీలకు ఆన్లైన్ హాజరు వీలైనంత సమయంలో పూర్తి చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ మేకల అశోక్ కు తెలియజేశారు.గ్రామం లో ఎక్కువ మంది పనికి వచ్చేవిదంగా ఏర్పాట్లు చేయాలని, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని పీల్డ్ అసిస్టెంట్ మేకల అశోక్ కి చూసించారు.ఎండతీవ్రతను దృష్టిలో పెట్టుకొని వేతనదారులైన శ్రామికులకు మజ్జిగ ప్యాకెట్ లు మరియు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ లు పంపిణీ చేశారు. పని ప్రదేశంలో నీరు, నీడ ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ లు అందుబాటులో ఉన్నట్లు ఏపీ ఓ దయాసాగర్ తెలిపారు.పనిప్రదేశంలో వేతనదారులైన శ్రామికులకు నీరు,నీడ, ఓ ఆర్ ఎస్ఫ్యాకెట్ లు అన్నీ వసతులు కల్పించడంతో పీల్డ్ అసిస్టెంట్ అశోక్ ను ఏపీఓ దయాసాగర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో పీల్డ్ అసిస్టెంట్ మేకల అశోక్ , సీనియర్ మేట్ కామినేని అనిల్ తదితరులు పాల్గొన్నారు.

The post కొలతల ప్రకారమే వేతనాలు..ఏపీఓ దయాసాగర్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *