ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాయితీ ఆఫర్ గడువు పొడిగింపు |


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా.. ఇంకా చాలా మంది ఆస్తి పన్ను చెల్లించట్లేదు. ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బు లేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు గడువును పొడిగిస్తోంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను చెల్లించేవారికి.. వడ్డీపై 50 శాతం రాయితీ లభిస్తుంది. ఈ గడువును ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకూ పొడిగించింది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందుగా చెల్లించే వారికి, పన్నుపై 5 శాతం తగ్గింపు ఇస్తోంది. దీనికి కూడా ఏప్రిల్ 30 వరకూ గడువు ఉంది.

ఇవాళ ఏమున్నాయి?

ఇరాన్ యుద్ధానికి 45 రోజులు పూర్తి అయ్యాయి. నేడు 46వ రోజు కొనసాగుతోంది. ఇవాళ ప్రపంచ క్వాంటం డే.. అమరావతిలో క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభం అవుతుంది. బీహార్ సీఎం పదవికి నేడు నితీశ్ కుమార్ రాజీనామా చేస్తారు. నేడు దేశవ్యాప్తంగా సెలవు. స్టాక్ మార్కెట్లు, బ్యాంకులు, స్కూళ్లు, ఆఫీసులకు సెలవు. MCX గోల్డ్ మాత్రం సాయంత్రం పనిచేస్తుంది. వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్ – హెజ్బొల్లా మధ్య చర్చలు జరగవచ్చు. IPLలో నేడు చెన్నై vs కోల్‌కతా మ్యాచ్ రాత్రి 7.30కి ఉంటుంది. నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి. ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కింద ఉన్నాయి చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *