అనంతపురం జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక


– శెట్టిపి జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే 11వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ జిల్లా జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టుకు ధర్మవరం బాలబాలికలు ఎంపిక కావడం జరిగింది అని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మే 1వ తేదీ తేదీ నుండి 4తేదీ వరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం పట్టణంలో జరిగే 11 వ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్టిక్స్ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలుర విభాగంలో ధర్మవరం పట్టణానికి చెందిన ఎం కార్తీక్ నాయక్ బాలికల విభాగంలో కిరణ్మయి, నిక్యశ్రీ ,యశస్విని, అలేఖ్య ధర్మవరం పట్టణానికి చెందిన 5మంది మంది బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు.
ఏప్రిల్ 15 నెల నందు అనంతపురం నగరంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్స్ నందు వీరు ప్రతిభా చూపి ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ఎంపికయ్యారు అని తెలిపారు. వీరి ఎంపిక పట్ల , ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామి రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ తుల్లా, శెట్టిపి జయచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో స్థాయిలో వీరు రాణించి ధర్మవరం పట్టణమునకు పేరు ప్రతిష్టలు తేవాలని వారు ఆకాంక్షించారు. ఎంపికైన క్రీడాకారులు బుధవారం రోజున బయలుదేరి రామచంద్రాపురం కి వెళ్లారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *