Wedding Season: ఎటు చూసినా పెళ్లి బాజాలే.. వధూవరులతో కళకళలాడుతున్న రత్నగిరి కొండలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Wedding Season: అన్నవరం రత్నగిరి కొండలపై వివాహాల రద్దీ, కొత్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం, వ్రతంతో ఆశీర్వాదాల కోసం భారీగా తరలివస్తున్నారు

+

News18

News18

ఆ కొండపై వధూవరులు ఒకటైతే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ముందుకు వెళ్తుందట, జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కొండపై కొలువైన స్వామి చూసుకుంటారని ఎంతో నమ్మకంతో ఒకటైన వధూవరులు చెబుతూ ఉంటారు. పెళ్లిళ్లు సీజన్ వచ్చిందంటే చాలు ఎంతో విశ్వాసంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేకమంది దంపతులు ఆ కొండలపై ఒకటి అవుతూ ఉంటారు.

రద్దీరీత్య పరమ పవనమైన మెట్లపై కూర్చుని వివాహం చేసుకున్నా చాలు మన ఇంటి వద్ద రిసెప్షన్ పెట్టుకోవచ్చు అన్న విధంగా ఆ కొండలపై కళ్యాణం చేసుకునేందుకు మక్కువ చూపుతారు, అలాంటి పరమ పావన కొండ ఎక్కడుంది? అక్కడ కొలువైన స్వామి అమ్మవార్లు ఎవరు? ఒకసారి క్లుప్తంగా చూద్దాం

తెలుగులోగిలిలో ఎలాంటి శుభకార్యక్రమం జరిగిన ఆ స్వామిని దర్శించడం, ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం ఒక సాంప్రదాయం. అటువంటి స్వామి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వివాహమైన దంపతులు సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం సకల శుభాలకు మూలం అంటూ పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.

అలాంటి స్వామి కొలువైన కొండపై కళ్యాణాలు చేసుకుంటే ఆ స్వామి ఆశీస్సులు నిండుగా ఉంటాయని భక్తులు భావిస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో గత రెండు రోజులుగా రత్నగిరి కొండలపై రికార్డు స్థాయిలో వధూవరులు ఒకటి అవుతున్నారు. అన్నవరం కొండపై ఎటు చూసిన దంపతులు ఒకటై స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో రత్నగిరి కొండలు వధూవరులతో కిటకిటలాడుతున్నాయి, అన్నవరం గ్రామం రిసార్ట్స్ ఫంక్షన్ హాల్స్ తో పాటు కొండపై రామాలయ ప్రాంగణం మట్టే వారి కల్యాణ మండపాలు కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి.

మరోపక్క పరమ పావనమైన శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించేందుకు నూతన వధూవరులు పోటెత్తారు. రాత్రి వివాహం అయినా తర్వాత వేకువుజామున మూడు గంటలనుంచి స్వామివారి వ్రతం ఆచరించేందుకు దంపతులు పోటెత్తారు. ఏది ఏమైనా రత్నగిరి కొండలపై ఒకటి కావడం ఆపై పరమపావనమైన సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించడం అంటే పూర్వజన్మ సుకృతంగా భావించాలంటూ పండితుల సైతం పేర్కొంటున్నారు.

రత్నగిరి కొండలు అంటే తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు ఎంతో ప్రీతిపాత్రం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్వామివారి సన్నిధిలో పెళ్లి జరగాలి అన్న ఆలోచనతో, మెట్లపై సైతం కూర్చొని వివాహం చేసుకున్న పరిస్థితులు అన్నవరంలో కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ఇక్కడ వివాహం చేసుకోవాలంటే స్వామివారి అనుగ్రహం సైతం ఉండాలంటూ అర్చకులు పేర్కొంటున్నారు. అలా స్వామివారి అనుగ్రహంతో ఒకటైన జంట అన్యోన్యంగా జీవిస్తుందన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *