మే 10 నుంచి 13వ తేదీ వరకూ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ – IMD తన తాజా బులిటెన్లో తెలిపింది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది అని వివరించింది. మే 10న తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఈ అంచనాలు, స్కైమెట్ అంచనాలతో సమానంగా ఉన్నాయి. అంటే.. ఏపీ, తెలంగాణ ప్రజలు.. మే 13 వరకూ వర్షాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదే.



