Vizag Beach: ఆ బీచ్‌లో సముద్రపు గవ్వలతో డెకరేషన్ వస్తువులు.. చూస్తేనే ఫుల్ ఖుషి అవుతారంతే | బిజినెస్


Last Updated:

Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం పలుకుతాయి. సముద్రంలో దొరికే గవ్వలతో రకరకాల వస్తువులు ఇక్కడ తయారు చేసి వస్తువులను అమ్ముతుంటారు.

+

Vizag

Vizag Beach

Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం పలుకుతాయి. సముద్రంలో దొరికే గవ్వలతో రకరకాల వస్తువులు ఇక్కడ తయారు చేసి వస్తువులు అమ్మకాలు చేస్తారు. విశాఖ సాగర తీరానికి వచ్చిన వారు ఎవ్వరైనా గవ్వలను కొనకుండా వెళ్లరు. విశాఖకు అధిక శాతం పర్యాటకులు వస్తారని కొత్త కొత్త మోడల్స్ తో ఏర్పాటు చేసిన ఈ గవ్వల వస్తువులు కొనుగోలు చేస్తారు అని నిర్వాహకులు నాగరాజు అంటున్నారు. బీచ్ కి వచ్చే ప్రతి పర్యాటకులు ఈ సముద్రపు గవ్వలను చూసి ముగ్ధులవ్వాల్సిందే అంటున్నారు.

ఆల్చిప్పలతో అలంకారం..

విశాఖపట్నం ఆర్కే బీచ్ బస్ స్టాప్ దగ్గరికి రాగానే బీచ్ కి వెళ్తుంటే గవ్వలతో అందంగా తీర్చిదిద్దిన అలంకార వస్తువులు కనిపిస్తుంటాయి. వాటిలో ఎక్కువగా వాల్‌ హ్యాంగింగ్స్‌, మిర్రర్స్‌, వెల్‌కమ్‌ బోర్డులు, ఇంటి గుమ్మాలకు అందాన్నిచ్చే గవ్వల దండ, ఫొటో ఫ్రేమ్‌లు, హోల్డర్స్‌, ఫ్లవర్‌ వాజ్‌లు,జ్యూయలరీ అలా ప్రతి సంవత్సరం కొత్త కొత్త మోడల్స్ తీసుకువచ్చి విశాఖ బీచ్ లో పెడతామని అంటున్నారు.

గవ్వలతో ఇంట్లో గలగల..

గవ్వలతో తయారుచేసిన వస్తువులు ఇంట్లో ఉంటే ఎంతో మంచిదని , అందుకే కొనుగోలు  చేస్తారని నిర్వాహకులు అంటున్నారు. పూజ గదిలో పెట్టుకునేందుకు గవ్వలు , శంఖాలు కొనుగోలు చేస్తారని అంటున్నారు.  ఇంట్లో అలంకరణగా అందంగా ఉంటాయని గవ్వలతో తయారుచేసిన దండలు , అద్దాలు అధికంగా కొనుగోలు చేస్తారని అంటున్నారు. తమ వద్ద ₹100 నుండి 2000 , 3000 వరకు ధర కలిగిన వస్తువులు ఉంటాయని అంటున్నారు.

ఇంటిలో సముద్రపు అందాలు..

సముద్రపు గవ్వలుతో విండో ఫ్రేములు, అలంకరణ అద్దాలు, బొకేలు ,  క్రిస్‌మస్‌, న్యూఇయర్‌ సమయంలో గవ్వలతో తయారు చేసిన స్పెషల్‌ దండలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఈ గవ్వలు వివిధ సైజుల్లో, పలు ఆకారాల్లో చాలా గట్టిగా ఉంటాయి. ఈ సారి మీరు బీచ్‌కు వెళ్లినప్పుడు తప్పక సందర్శించండి.. వారి నైపుణ్యానికి కళకు మీరు ముగ్ధులవ్వండి.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *