#TrishaAtTirumala #HBDTrisha #TNElectionResults2026 #TrishaKrishnan #TVKVijay #TirumalaDarshanదక్షిణ భారత అగ్ర కథానాయిక త్రిష నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (మే 4) తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. నేడు త్రిష పుట్టినరోజు కావడంతో పాటు, ఆమె సన్నిహితుడు దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ భవితవ్యాన్ని తేల్చే తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా నేడే వెలువడుతుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ విజయం కోసమే త్రిష మొక్కులు తీర్చుకున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం అందించి ప్రసాదాలు అందజేశారు. తన ఫేవరెట్ హీరోయిన్ను చూడటానికి భక్తులు, అభిమానులు సెల్ఫీల కోసం పోటీ పడ్డారు.
Source link


