Last Updated:
Viral News: కక్కూర్తి, డబ్బు మీద ఆశ సమాజంలో మనుషులను హీనస్థితికి దిగజార్చుతోందిన. ఇప్పటి వరకు ఇంట్లో, బ్యాంకులు, షాపుల్లో చోరీకి పాల్పడిన వాళ్లను చూశాం. కాని మొదటిసారిగా గుడివాడలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘోర అపచారానికి పాల్పడ్డారు ఆలయ కమిటీ సభ్యులు.
Viral News: కక్కూర్తి, డబ్బు మీద ఆశ సమాజంలో మనుషులను హీనస్థితికి దిగజార్చుతోందిన. ఇప్పటి వరకు ఇంట్లో, బ్యాంకులు, షాపుల్లో చోరీకి పాల్పడిన వాళ్లను చూశాం. కాని మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘోర అపచారానికి పాల్పడ్డారు ఆలయ కమిటీ సభ్యులు. వేంకటేశ్వరస్వామి ఆలయంలోని స్వామివారికి బంగారు కిరీటాన్ని ఓ భక్తుడు 2025లో బహుకరించారు. అయితే దాన్ని ఆలయ కమిటీ సభ్యులు బంగారు షాపులో తాకట్టు పెట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిరీటాన్ని బహుకరించిన దాత ఈవిషయంపై నిలదీయడంతో బ్యాంకులో భద్రపరిచామని చెప్పారు. అయితే అసలు విషయం బయటపడటంతో పోలీసులు దాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుడివాడలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి బంగారు కిరీటం తాకట్టు పెట్టుకున్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 2025లో స్వామివారికి కిరీటాన్ని సమర్పించారు దాత మాటూరు సుబ్బారావు. రూ.70 లక్షలతో తయారు చేయించిన దేవుడికి కానుకగా ఇచ్చిన కిరీటాన్ని స్వామివారికి అలంకరించమని దాత అడుగుతుంటే ఆలయ కమిటీ సభ్యులు అబద్దం చెబుతూ వచ్చారు. అసలు విషయం ఏమిటంటే బ్యాంకులో భద్రపరిచామని పాలక వర్గ సభ్యులు చెబుతూ వచ్చారు.
అయితే దేవుడికి కిరీటాన్ని బహుకరించిన దాత మాటూరు సుబ్బారావు ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు విచారణ మొదలుపెట్టారు. అప్పుడే స్వామివారి బంగారు కిరీటం తాకట్టు పెట్టిన వార్త బయటకు వచ్చింది. సుమారు కోటి రూపాయల విలువ చేసే కిరీటాన్ని రూ.38 లక్షలకు తాకట్టుపెట్టారని దాత ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు అలా తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో వ్యాపారం చేసినట్లుగా తెలుస్తోంది. భక్తులు ఇచ్చిన కానుకలతో ఆలయ కమిటీ వ్యాపారం చేస్తున్నారని దాతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆలయ ప్రెసిడెంట్ మోహనరావుపై కేసు నమోదు చేశారు పోలీసులు. కిరీటాన్ని స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయశాఖ అధికారులు రంగంలోకి దిగారు. అయితే తాకట్టు వ్యాపారి రాజస్థాన్‌లో ఉన్నట్టు గుర్తించారు. అతను తిరిగి వచ్చిన తర్వాత ఈ స్వామివారి కిరీటాన్ని రికవరీ చేస్తామని పోలీసులు భక్తులకు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Gudivada,Visakhapatnam,Andhra Pradesh



