Telangana Cabinet: ఈసారి యాదాద్రిలో తెలంగాణ కేబినెట్.. కీలక నిర్ణయాలు ఇవే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Telangana Cabinet: యాదగిరిగుట్ట ఆలయం తెలంగాణలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో పునర్నిర్మాణం జరిగింది. ఈ భేటీ ద్వారా కేబినెట్ సమావేశాలను హైదరాబాద్‌లోనే కాకుండా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా నిర్వహించవచ్చనే సంకేతం ఇస్తున్నట్లవుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీని మే 21 (గురువారం)న కాకుండా మే 23కి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం యాదాద్రి యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రాంతంలో జరుగుతుంది. సచివాలయంలో జరగాల్సిన భేటీని ఆలయ ప్రాంతానికి మార్చడం రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యాన్ని సూచిస్తోంది.

నమస్తే తెలంగాణ రిపోర్టు ప్రకారం, ఈ మార్పు బాసరలో సరస్వతి అంత్య పుష్కరాల కార్యక్రమాల వల్ల జరిగింది. మంత్రులు చాలామంది కుటుంబ సమేతంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో 21న జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి మే 23న యాదగిరిగుట్టలో వేద పాఠశాలను ప్రారంభించనున్నారు. అదే సందర్భంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి: Tarot Horoscope 20th May: మే 20న ఆ రాశుల వారిలో అనూహ్య మార్పులు. మీ రాశి కార్డు ఏం చెబుతోందో చూడండి!

ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచనలతో ప్రభుత్వ శాఖలు, సీఎం కార్యాలయం తొన్ని చర్యలు అమలు చేయడంపై చర్చ జరగనుంది. ఇందులో ఆన్‌లైన్ సమీక్షలు, ఎయిర్ కండీషనర్ల వాడకం తగ్గించడం, విదేశీ పర్యటనలు పరిమితం చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ వంటివి ఉంటాయి. గవర్నర్, సీఎం కాన్వాయ్‌లను ఇప్పటికే తగ్గించారు.

జూన్ 2 నుంచి అమలు చేయాల్సిన కొత్త పథకాలు, ఇందిరమ్మ హౌసింగ్ ఫేజ్-2 అమలు, రెండు లక్షల కొత్త చేయూత పెన్షన్లు ఇవ్వడం, ఇతర సంక్షేమ పథకాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు, కార్యక్రమాలు వంటివి కూడా అజెండాలో ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ల ఫీజు నియంత్రణ బిల్లు, మహారాష్ట్రతో తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై చర్చలు, మెట్రో రైలు విస్తరణ, రాజీవ్ యువ వికాసం వంటి అంశాలపై కూడా చర్చ జరగవచ్చు.

ఇవి కూడా చదవండి: Chandrababu: మత్స్యకారుల కుటుంబంతో చంద్రబాబు ఆత్మీయ భోజనం.. ఫొటోలు చూడండి

యాదగిరిగుట్ట ఆలయం తెలంగాణలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో పునర్నిర్మాణం జరిగింది. ఈ భేటీ ద్వారా కేబినెట్ సమావేశాలను హైదరాబాద్‌లోనే కాకుండా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా నిర్వహించవచ్చనే సంకేతం ఇస్తున్నట్లవుతోంది. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడంపై ప్రకటనలు రావచ్చు.

మంత్రివర్గ విస్తరణ కూడా ఈ భేటీలో జరగవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్న తరుణంలో ఇది కీలకమవుతుంది. ప్రభుత్వం జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *