Special Buses: ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రం నుండి హైదరాబాద్‌కి డైరెక్ట్ ఆర్టీసీ బస్.. ఛార్జీ, టైమింగ్స్ ఇవే | బిజినెస్


Last Updated:

Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి ప్రతిరోజు ఆర్టీసీ సూపర్ లగ్జరీ స్పెషల్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. కాకినాడ ,రాజమండ్రి సిటీలతో పాటు తుని ,అన్నవరం జగ్గంపేట మీదుగా మరో సర్వీసు ప్రారంభమైంది. చార్జీ వివరాలు ఇవిగో.

+

Special

Special Buses

Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి భాగ్య నగరానికి అంటే హైదరాబాద్ ప్రాంతానికి ప్రతిరోజు ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అందుబాటులో ఉన్నట్లు డిపో మేనేజర్ రమణ స్పష్టం చేశారు, కాకినాడ ,రాజమండ్రి వంటి సిటీలు కాకుండా తుని ,అన్నవరం జగ్గంపేట, మీదగా ఈ బస్సు ప్రారంభమై హైదరాబాద్కు చేరుకుంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ బస్సు ఎక్కడ ప్రారంభమవుతుంది ,వాటి ధర ఎంత? తదితరు విషయాలు ఆర్టీసీ డిఎం తెలియజేశారు ఒకసారి క్లుప్తంగా చూద్దాం

సత్యదేవుని సన్నిధికి బస్..

ప్రతిరోజు భాగ్యనగరమైన హైదరాబాద్ ప్రాంతానికి వెళ్లేందుకు అనేకమంది రైళ్లు, బస్సులు ద్వారా ప్రయాణాలు చేస్తూ ఉంటారు.అయితే రైలుకు టికెట్లు దొరకక తత్కాల్లో రెట్టింపు డబ్బులు పెట్టి మరి ప్రయాణాలు చేస్తారు. అంతకుమించి ప్రైవేటు ట్రావెల్స్ అయితే రోజుకు ఒక రేటు ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అన్ సీజన్ కాస్త రేట్లు సాధారణంగా ఉన్న ,ఏమాత్రం విశేషమైన రోజులు వచ్చాయా అమాంతం వాటి రేటు రెండింతలు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ప్రతిరోజు ఒకే రేటు ఉండే విధంగా గ్రామీణ ప్రాంతాల మీదగా ఆర్టీసీ బస్సు హైదరాబాద్ బిహెచ్ఇఎల్ కు చేరుకుంటుందని ఆర్టీసీ తుని అన్నవరం  డిపో మేనేజర్ రమణ తెలియజేశారు.

లగ్జరీ బస్ ఛార్జీ..

ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు తుని అన్నవరం ప్రాంతాల్లో ఈ బస్సు ప్రారంభమై జగ్గంపేట ,రాజమండ్రి మీదగా ఈ బస్సు ప్రయాణం కొనసాగుతుందన్నారు .అనంతరం మరసటి రోజు ఉదయం హైదరాబాద్ బీహెచ్ఈఎల్ సెంటర్ కు చేరుకుంటుందన్నారు, ఈ బస్సు ప్రయాణపు ధర ఒక్కొక్కరికి రూ. 940 గా తెలియజేశారు, సూపర్ లగ్జరీ బస్సు గా డిపో మేనేజర్ స్పష్టం చేశారు. అదే విధంగా ఇదే బస్సు హైదరాబాద్ బిహెచ్ఇఎల్ ప్రాంతం నుంచి ప్రతి రోజు గోదావరి జిల్లాల ప్రాంతానికి ఈ బస్సు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. అయితే వచ్చేటప్పుడు దీని ధర 980గా తెలిపారు.

రెగ్యులర్ సర్వీస్..

ఏది ఏమైనా సుఖవంతమైన ఆర్టీసీ బస్సు సేవలను ప్రజలు వినియోగించుకోవాలని డిపో మేనేజర్ రమణ తెలిపారు. ఆన్లైన్ ద్వారా టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ టికెట్స్ ముందుగా బుక్ చేసుకోవచ్చని, అలా కాదంటే ఏడు గంటలకు తుని ఆర్టీసీ కాంప్లెక్స్, ఏడున్నరకు అన్నవరం, తదుపరి 9 గంటలకు మిగతా బస్ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఈ బస్సు అందుబాటులో ఉంటుందని డిపో మేనేజర్ రమణ తెలిపారు. ఈరోజు ఆ రోజున కాకుండా ప్రతిరోజు బస్సు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి రోజులైనా ఒకే ధర ఆర్టీసీ మెయింటైన్ చేస్తుందంటూ డిపో మేనేజర్ పేర్కొన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *