ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ప్రకటన ప్రకారం, ఈ చర్య విద్యుత్ బకాయిలను తగ్గించి, ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఉద్దేశించినది. 9 జిల్లాల్లోని ప్రభుత్వ సంస్థల నుంచి సుమారు ₹9,507 కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు తెలిపారు. స్మార్ట్ మీటర్లు ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ప్రీపెయిడ్ వ్యవస్థ ద్వారా వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించి, బకాయిలు పేరుకుపోకుండా చూడవచ్చని CMD తెలిపారు.
స్మార్ట్ మీటర్లు సాధారణ మీటర్ల కంటే అధునాతన సాంకేతికతతో పనిచేస్తాయి. ఇవి ప్రతి 15 నిమిషాలకు లేదా రోజువారీ వినియోగ డేటాను నమోదు చేసి, రియల్-టైమ్ మానిటరింగ్ అందిస్తాయి. మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా వినియోగదారులు తమ వినియోగాన్ని ఎప్పుడైనా చూసుకోవచ్చు. ప్రీపెయిడ్ మోడ్‌లో ముందుగా రీఛార్జ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ సున్నాకు చేరితే ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. అంటే.. ప్రీ-పెయిడ్ మొబైల్ రీఛార్జ్ సర్వీస్ లాగా అనుకోవచ్చు.
ప్రభుత్వ సర్వీసులకు “ఈ-వాలెట్” సౌకర్యం ద్వారా రీఛార్జ్ చేయవచ్చు. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి (DDO) అధ్వర్యంలో అకౌంట్ ఏర్పాటు చేసి, ముందస్తు చెల్లింపులు చేయాలి. వినియోగాన్ని బట్టీ.. రోజువారీ మనీ బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. హాస్పిటల్స్ వంటి క్రిటికల్ సర్వీసులకు.. బ్యాలెన్స్ జీరోకి చేరినా.. కరెంటును ఆపకుండా.. పెనాల్టీ వడ్డీ విధిస్తారు. ఇతర సేవలకు బ్యాలెన్స్ అయిపోతే.. తర్వాత వర్కింగ్ డే రోజున కరెంటు సప్లై ఆగిపోతుంది. ఐతే… ఫ్రెండ్లీ అవర్స్ అయి రాత్రి వేళ సెలవుల్లో రక్షణ ఉంటుంది.
ప్రభుత్వం ఏం చెప్పింది?
ఏపీఎస్పీడీసీఎల్ CMD శివశంకర్ లోతేటి మాట్లాడుతూ, “ప్రీపెయిడ్ మీటరింగ్ ద్వారా వినియోగాన్ని నియంత్రించి, బిల్లుల్లో ఆదా చేసుకోవచ్చు. పారదర్శకత పెరుగుతుంది” అని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలు, రాష్ట్ర ఆర్థిక అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, అంగన్వాడీలకు విస్తరించాలని మార్చిలో నిర్ణయించారు.
ఈ వ్యవస్థ ద్వారా డిస్కంలో ఆర్థిక స్థితి మెరుగుపడి, AT&C నష్టాలు తగ్గుతాయని కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఏపీలో RDSS కింద లక్షల స్మార్ట్ మీటర్లు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ సేవల నుంచి ప్రారంభించి, తదుపరి దశల్లో వినియోగదారులకు విస్తరించే అవకాశం ఉంది.
ఈ మార్పు విద్యుత్ రంగాన్ని డిజిటలైజ్ చేసి, సమర్థవంతం చేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు ముందస్తు రీఛార్జ్‌లపై శ్రద్ధ వహించి, సేవల్లో అంతరాయం లేకుండా చూసుకోవాలి. ఈ వ్యవస్థ దీర్ఘకాలికంగా విద్యుత్ ఆదా, పారదర్శకత, మంచి పాలనకు దోహదపడుతుంది.


