SIR in AP and Telangana: మరోసారి ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే ? |


Last Updated:

ఏపీ, తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఏపీలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు.. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు.

News18
News18

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో విడత ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ భారీ ప్రక్రియలో భాగంగా సుమారు 3.94 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు (BLO) రంగంలోకి దిగనున్నారు. వీరు దాదాపు 36.73 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో శుద్ధి చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అనర్హులు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి.. అర్హులైన కొత్త ఓటర్లను చేర్చనున్నారు.

జాతీయ జనగణన (సెన్సస్) పనులతో ఈ ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం అనుసంధానం చేసింది. క్షేత్రస్థాయి యంత్రాంగం సమన్వయంతో పనిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అర్హులైన పౌరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఏపీ, తెలంగాణలో SIR ఎప్పుడంటే ?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ (SIR) షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఈ రాష్ట్రంలో సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. తెలంగాణలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టి, అక్టోబర్ 1న తుది జాబితాను ప్రకటిస్తారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఈ భారీ కార్యక్రమం జరగనుంది.

ఆ మూడు రాష్ట్రాలు మినహా..

హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ మినహా దేశమంతా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి ఇంటికి వెళ్లే అధికారులు ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి, పాత నమోదులను నిశితంగా పరిశీలిస్తారు. డూప్లికేట్ ఓట్లను గుర్తించడం ద్వారా రాబోయే ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా సిద్ధం చేయాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వాడుకుని తమ పేరు జాబితాలో ఉండేలా చూసుకోవాలి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *