Last Updated:
Pithapuram Political War: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పొలిటికల్ వార్ పీక్స్‌కి చేరుకుంది. స్థానిక టీడీపీ నేత వర్మ మాజీ ఎమ్మెల్యే దొరబాబు మధ్య వర్గవిభేదాలు కాస్తా జనసేన, టిడిపి మధ్య యుద్ధ వాతావరణానికి దారి తీసింది.
Pithapuram Political War: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పొలిటికల్ వార్ పీక్స్‌కి చేరుకుంది. స్థానిక టీడీపీ నేత వర్మ మాజీ ఎమ్మెల్యే దొరబాబు మధ్య వర్గవిభేదాలు కాస్తా జనసేన, టిడిపి మధ్య యుద్ధ వాతావరణానికి దారి తీసింది. ఇలాంటి సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే విధంగా మెగాబ్రదర్ నాగబాబు పిఠాపురం ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు రాకతో జనసేన, టీడీపీ శ్రేణులు ఆయన ఏం మాట్లాడుతారో అని ఆసక్తిగా ఎదురుచూశాయి. నిజానికి నాగబాబు కొన్ని విషయాల్లో చాలా వైల్డ్ గా మాట్లాడతారు అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. గతంలో పిఠాపురం నుంచి అనేక సార్లు నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో నాగబాబు మరోసారి పిఠాపురంలో అడుగుపెట్టడం, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసలు నాగబాబు ఫిఠాపురం ఎందుకొచ్చారు..? ఏం మాట్లాడారు..? సొంత తమ్ముడి నియోజకవర్గంలో రాజుకున్న అగ్గిని చల్లార్చే విషయంలో ఆయన పాత్ర ఎంత ఉందనే విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో జనసేన ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలుపొందిన పిఠాపురం నియోజకవర్గం పొలిటికల్‌గా స్పెషల్‌గా మారింది. అక్కడి నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ క్యాబినెట్ మంత్రిగానే కాకుండా డిప్యూటీ సీఎం పదవి దక్కడంతో స్థానిక సమస్యలు, రాజకీయ వ్యవహారాలు అన్న నాగబాబే చూసుకుంటారనే టాక్ నడిచింది. మొదట్లో అదే జరిగింది. ప్రతి కార్యక్రమంలో నాగబాబు పాల్గొనడం, ఒక్కొక్కసారి వార్నింగ్ ఇవ్వడం అంతకుమించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్లేవారు, అదే తరుణంలో నాగబాబు చేసిన కొన్ని కామెంట్స్ గతంలో రచ్చకు దారి తీశాయి. దీంతో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ కావడంతో నాగబాబు కాస్త వెనక ఉండడం, పిఠాపురం నియోజకవర్గానికి కాస్త దూరం కావడం అంతకుమించి ఎమ్మెల్సీ లాంటి పదవులు ఉన్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ పనుల్లో నాగబాబు పాత్ర అంతంత మాత్రంగా మారింది. ఇలాంటి సమయంలో ఆ నియోజకవర్గానికి ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే దొరబాబు కీ రోల్‌గా మారారు.
ఇక్కడే అసలు సమస్య మొదలైందని చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచిన దొరబాబు పిఠాపురంలో సేవలందించారు. ఆ తర్వాత జనసేనలోకి జంప్ అయ్యారు. దీంతో టీడీపీ నుంచి టికెట్ త్యాగం చేసుకున్న వర్మ వర్సెస్ దొరబాబుగా పిఠాపురం రాజకీయాలు మారిపోయాయి. గతంలో ఎన్నో కేసులు పెట్టించుకున్నాం ఇప్పటికీ కోర్టులకు తిరుగుతున్నాం ఇప్పుడు పార్టీలోకి చేరి పెత్తనం సాగిస్తూ ఇబ్బందులు పెడతారా అంటూ వర్మ ఆరోపిస్తున్నారు. తాజాగా రెండు రోజుల కిందట జరిగిన గొడవలో సైతం చంద్రబాబు ఫోటో ఏది అంటూ అధికారులను నిలదీస్తున్న సమయంలో దొరబాబు , వర్మ ఒకరినొకరు తోసుకొనే వరకు వచ్చారని చెప్పుకోవచ్చు. ఆ విషయం కూడా రచ్చ రచ్చగా మారింది. అయితే ఇక్కడ వర్మ మాట్లాడుతూ నా టార్గెట్ జనసేన కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోయినా నేను ప్రశ్నిస్తాను, అసలు జనసేన టిడిపి గొడవలు అంటున్నారు. వైసీపీ నుంచి వచ్చి జనసేనలో పెత్తనం చేస్తూ నేతలను ఆ గౌరవ పరుస్తున్న దొరబాబు అన్న విధంగా వర్మ మాట్లాడుతూ వచ్చారు.
టీడీపీ నేత వర్మ, జనసేన నేత దొరబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. నిజానికి నాగబాబు మాటలు సంచలనగా మారతాయని మీడియా అంతా అక్కడికి చేరినప్పటికీ ఈసారి నాగబాబు చాలా ప్రశాంతంగా కనిపించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి విషయంపై చర్చించారు. అయితే రెండు రోజుల కింద జరిగిన గొడవను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా అంతా అధినాయకుడు ఏం చెబుతున్నారో అదే విధంగా చూసుకుంటాం అంటూ ఆ విషయాన్ని మాట్లాడేందుకు సైతం నాగబాబు అంగీకరించలేదు. దీంతో సైలెంట్ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది.
దీనిబట్టి చూస్తుంటే నాగబాబు సైతం ఈ విషయంలో తల దూర్చవద్దని స్వయాన సోదరుడు పవన్ కల్యాణ్ డైరెక్షన్ ఇచ్చినట్లుగా జనసేన నాయకులు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పలు విషయాలు తెలుసుకోవాలని ఆదేశించారు. వర్మ కాస్త తగ్గాలి అన్న విధంగా సీఎం మాట్లాడారు అంటూ ప్రచారం జరుగుతుంది ,మొత్తానికి జనసేన టిడిపికి సంబంధించిన గొడవలు నేపథ్యంలో నాగబాబు సైతం వచ్చి ఇండైరెక్టుగా సమస్యలు పరిష్కరిస్తున్నారు అన్న వాదన సైతం పిఠాపురంలో వినిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh
Apr 24, 2026 11:41 AM IST


