Petrol Price Hike: ఏపీలో రిక్షాలెక్కిన మోటార్ సైకిల్స్.. కోనసీమలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసన! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల వినూత్న నిరసనలు, సైకిల్ ర్యాలీలు, రిక్షాలపై స్కూటర్లు, కోనసీమ కాకినాడలో ధరలు తగ్గించాలని వినతులు

+

News18

News18

ఏపీలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా కొన్నిచోట్ల ఈ ప్రదర్శనలు వినూత్నంగా నిర్వహించాలని చెప్పుకోవచ్చు. పెట్రోల్ ధరలు పెరగడంతో ద్విచక్ర వాహనాలు కార్లుపై ప్రయాణాలు చేయలేమంటూ, సైకిల్లు అదే విధంగా రిక్షాలపై ప్రయాణాలు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఇంకొన్ని చోట్ల రిక్షాలపై స్కూటర్లు వేసి నిరసన తెలియజేశారు, గోదావరి జిల్లాలకు సంబంధించి తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలో ఈ కార్యక్రమాలు జరిగాయి ముఖ్యంగా కోనసీమలో జరిగిన వినూత్న నిరసన కార్యక్రమాలు ఒకసారి చూద్దాం

డాక్టర్ బి అర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం అక్కడి నుంచి కొత్తపేట ఆర్‌డీవో కార్యాలయం వరకు జగ్గిరెడ్డి ఒక రిక్షాపై మోటార్ సైకిల్‌ను ఎక్కించి స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతూ కోత్తపేట రెవెన్యూ డివిజన్ అధికారికి వినతిపత్రం అందజేశారు.

ప్రజల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుందని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం, తుని, కాకినాడ సిటీ ప్రాంతాల్లో సైతం వైసీపీ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక ర్యాలీలు చేపట్టి స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ వినతి పత్రాలు అందించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *