Pawan Kalyan: సీఎం విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

తమిళనాడు సీఎం విజయ్‌తో తనను పోల్చడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు వేరని, గతాన్ని దృష్టిలో ఉంచుకునే తాను అడుగులు వేస్తున్నానని ఆయన మంగళగిరిలో జరిగిన సమావేశంలో తేల్చి చెప్పారు.

News18
News18

జనసేన పార్టీ కార్యాలయంలో నేడు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ముఖ్యమంత్రి అవ్వడంపై ఆయన స్పందించారు. “పక్కరాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి గెలవగానే నాతో పోల్చుతున్నారు. 2019లో రెండు చోట్లా నన్ను ఓడించారు. తమిళనాడు పరిస్థితులు వేరు. ఏపీ పరిస్థితులు వేరు. అందరూ నన్ను వదిలేసినా ఒంటరిగా పార్టీని ముందుకు తీసుకెళ్లాను. ఊళ్లో పెళ్లికి కుక్కలు హడావిడి చేసినట్లుగా ఉంది. దయచేసి ఆ పార్టీతో పోల్చొద్దు..” అంటూ వ్యాఖ్యానించారు.

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్.. రాజకీయాల్లోకి వచ్చిన రెండేళ్లలోనే ఏకంగా సీఎం పీఠం అధిష్టించారు. దీంతో ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి ఉంటే కచ్చితంగా గొప్ప విజయం సాధించేవారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ పైవిధంగా మాట్లాడారు. రాజకీయాల్లో ఏ ఇద్దరు నాయకుల ప్రయాణం ఒకేలా ఉండదని, ప్రతీ రాష్ట్రానికి భిన్నమైన సామాజిక, రాజకీయ సమీకరణాలు ఉంటాయని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *