ఇళ్లకే అంగన్‌వాడీ సరుకులు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణలో ఎండలు బాగా పెరగడంతో.. ప్రభుత్వం మే 1 నుంచి 31 వరకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. అందువల్ల ఆ నెలలో పోషకాహార సరుకులను లబ్ధిదారుల ఇళ్లకే డైరెక్టుగా పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ఎండల తీవ్రత వల్ల అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు సరిగా రావట్లేదు. అందుకే ప్రభుత్వం ఈ ప్లాన్ చేసింది. గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు.. నెలకు 30 గుడ్లు, నూనె, పాలు, కందిపప్పు, బియ్యం, 7 నెలల నుంచి 3 ఏళ్ల లోపు పిల్లలకు 16 గుడ్లు, బాలామృతం, పాలు, ఇతర సరుకులను ఇళ్లకే తెచ్చి ఇస్తారు. జూన్ 1 నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ అవుతాయి.


