శ్రీ పరాభవ నామ సంవత్సరానికి అర్థం చెప్పిన చిరంజీవి
తెలుగు ప్రజల నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా, ఈ ఏడాది పేరులో ఉన్న అంతరార్థాన్ని వివరిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, కొత్త సంవత్సరానికి స్ఫూర్తిదాయకమైన అర్థాన్ని జోడించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ తెలుగు నూతన సంవత్సరంలో అధర్మానికి, అహంకారానికి ధర్మం చేతిలో పరాభవం (ఓటమి) జరగాలని చిరంజీవి ఆకాంక్షించారు. శాంతి, స్నేహం,…


