AP Telangana Latest News Updates: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వ్యతిరేకించిన వైసీపీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
“నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి”..: ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక ఘట్టానికి దేశ పార్లమెంటు వేదిక కావడం అత్యంత సంతోషకరమని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదించడం ప్రజలందరూ గర్వించదగ్గ రోజన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన…


