తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు నాల్గవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం…


