Murder Case: కాకినాడలో అర్ధరాత్రి దారుణం.. అర్థరాత్రి రోడ్డుపై వెళ్తున్న కానిస్టేబుల్ పీక కోసి కిరాతక హత్య.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Murder Case: కాకినాడ గాంధీనగర్ లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి నాగేశ్వరరావు అర్ధరాత్రి దుండగుల చేతిలో హత్య, కక్షలు లేదా మద్యం వివాదం కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

+

News18

News18

కాకినాడ అర్ధరాత్రి ఒకసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న కాకినాడ నగరంలో ప్రజలను రక్షించే పోలీసుల్ని దుండగులు అత్యంత కిరాతకంగా చంపేశారు. దీంతో నగరంలో ఒక్కసారిగా భయాందోళన మొదలైంది. అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న కానిస్టేబుల్‌ను అత్యంత కిరాతకంగా పీకకోసి కొన్నిచోట్ల కత్తితో గాయాలు చేసి దుండగులు హతమార్చారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేశారు. కానిస్టేబుల్‌ను చంపడానికి కారణాలు ఏంటి? ఎవరు చంపారు? అన్న విషయాలపై సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు ఆరా తీస్తున్నారు

ఏ సమస్య వచ్చినా పోలీసులకు చెబుతాం, పోలీసులే ఆ సమస్యలు పరిష్కరిస్తారు, అలాంటి పోలీసునే కాకినాడ జిల్లా కేంద్రంలో దుండగులు పొట్టన పెట్టుకున్నారు. కాకినాడ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి హత్య ఘటన చోటుచేసుకుంది. కాకినాడకు సంబంధించి ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జి నాగేశ్వరరావు గత రాత్రి కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి నడుచుకుని వెళుతుండగా, ద్విచక్ర వాహనాలపై వచ్చి అతని పీక కోసి దారుణంగా హతమార్చినట్లు స్పష్టమవుతుంది.

దీంతో పోలీస్ కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు, విషయం తెలుసుకున్న జిల్లా ఏ ఎస్ పి దేవరాజ్ 2 టౌన్ సిఐ అప్పలనాయుడు, ఇతర పోలీస్ యంత్రాంగం ఘటన ప్రాంతానికి చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఆ సమీప ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి ఎవరు చేశారు అన్నదానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

కాకినాడ కేంద్రంగా జరిగిన కానిస్టేబుల్ హత్యకు కక్షలే కారణం అంటూ ప్రచారం జరుగుతుంది. అంతకుమించి కుటుంబసభ్యులు ఈ హత్య చేశారా? లేదా చేయించారా? అన్న ప్రచారం సైతం జోరు అందుకుంది. నిజానికి అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలు మద్యం మత్తే అంటూ మరో రకమైన ప్రచారం జోరుగా సాగుతుంది. ఏదేమైనా ఈ విషయంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మీడియా సమావేశం ద్వారా అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనంతరం ప్రకటించనున్నారు.

రాత్రి సమయంలో అతిగా మద్యం సేవించి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది, ఈ మధ్యకాలంలో మద్యం సేవించిన తర్వాత జరిగే గొడవలే ఎక్కువగా ఏపీలో కనిపిస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన మర్డర్ అలాంటిదా కాదా అన్నది పోలీసులు తేల్చాలి. కాకినాడలో జోరుగా ఇది మద్యానికి సంబంధించిన గొడవ అంటూ ప్రచారం జరుగుతుంది

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *