మే 16న లక్షదీవులు, రాయలసీమ, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాంలో అక్కడక్కడా జల్లులు పడతాయనీ ఉరుములు, మెరుపులు వస్తాయని IMD చెప్పింది. ఈదురు గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని తెలిపింది. అదే విధంగా మే 16, 17న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయి అని భారత వాతావరణ శాఖ చెప్పింది. కర్ణాటకలో 16 నుంచి 18 వరకూ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మే 16న తెలంగాణకి మాత్రం వర్ష సూచన ఇవ్వలేదు.



