Last Updated:
Medical Shops Closed: దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఫార్మసీ దుకాణాలు మూతపడనున్నాయి. అందుకు సంబంధించి ఏపీ, ఇండియా అసోసియేషన్ బంద్ విధివిధానాల సైతం వివరించింది. అత్యవసర మెడిసిన్స్ కోసం నగరాల్లో రెండు నుంచి మూడు గ్రామాల్లో ఒక్కొక్క మందుల షాపు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
Medical Shops Closed: దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఫార్మసీ దుకాణాలు మూతపడనున్నాయి. అందుకు సంబంధించి ఏపీ, ఇండియా అసోసియేషన్ బంద్ విధివిధానాల సైతం వివరించింది. అత్యవసర మెడిసిన్స్ కోసం నగరాల్లో రెండు నుంచి మూడు గ్రామాల్లో ఒక్కొక్క మందుల షాపు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. దాదాపుగా అన్ని మందుల దుకాణాలు ఏపీ తెలంగాణలో మూతపడనున్నాయి. దీంతో అత్యవసరం అయితే మందులు ముందు రోజే కొనుగోలు చేయడం మంచిదంటూ వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ప్రజలకు నిత్యవసరమైన ఈ ఫార్మసీ దుకాణాలు మూసి వేయడానికి కారణం ఏంటి..? దుకాణదారులు ఏం చెబుతున్నారు..? అధికారులు ఏమంటున్నారు..? ఒకసారి క్లుప్తంగా చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీ బుధవారం ఫార్మసీ దుకాణాలు మూతపడనున్నాయి. ప్రధానంగా ఆన్లైన్ మార్కెట్లో మందులు అమ్మకాలు నిరసిస్తూ యూనియన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం అవుతుంది. కరోనా విపత్కర పరిస్థితిలో నేపథ్యంలో ఆన్లైన్కు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని, నాటి పరిస్థితిని ఆసరాగా తీసుకుని నేటి వరకు ఇస్టా రాజ్యమైన ఆఫర్లు ఇస్తూ, అంతకుమించి డూప్లికేట్ మెడిసిన్స్ ఆన్లైన్లో ప్రజలకు అందిస్తున్నారంటూ మెడికల్ దుకాణదారులు వాపోతున్నారు. దీంతో గోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈ మందులు దుకాణాలు 20వ తేదీన తెరవబడవని జిల్లా ప్రతినిధులు తెలియజేశారు. అయితే ప్రజలు అత్యవసరం నేపథ్యంలో కొన్ని మందులు దుకాణాలు అందుబాటులో ఉన్నాయంటూ ఆ మందులు దుకాణాల వివరాల సైతం తెలియజేశారు.
ఆన్లైన్ ద్వారా మందులు ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో వీరి వ్యాపారాలు పడిపోతున్నాయి అనే విధంగా మీరు ముందుకు వెళ్తున్నారా ? లేక ప్రజలకు నిజంగా డూప్లికేట్ మెడిసిన్ అందడం ద్వారా అన్యాయం జరుగుతుంది అన్న విషయంపై ముందుకు వెళ్తున్నారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి దుకాణంలో కొన్ని మందులు కన్నా ఆన్లైన్లో కొనే మందులు చవకగా వస్తున్నాయి అంటూ ప్రజలు పేర్కొంటున్నారు, ఇలాంటి తరుణంలో అవి ఒరిజినల్ మందులు కాదు అని వ్యాపారులు పేర్కొనడంతో చర్చ జరుగుతుంది . ఏది ఏమైనా ఇలాంటి సమస్యలపై ఈ నెల 20వ తేదీ బుధవారం అన్ని మందుల దుకాణాలు మూతపన్నున్నాయని చెప్పుకోవచ్చు. అత్యవసరమైతే కచ్చితంగా ముందు రోజు అంటే నేడు కచ్చితంగా మందులు తీసుకుని ఇంట్లో పెట్టుకోవడం మంచిదని చెప్పుకోవచ్చు.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Kakinada,East Godavari,Andhra Pradesh


