Last Updated:
చిత్తూరు జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు భారీ డిమాండ్, దరఖాస్తుల గడువు ఈ నెల 20 వరకు పొడిగింపు
గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్స్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించాలనే ఉద్దేశంతో కస్తూర్భాగాంధీ విద్యా లయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉంది. నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఉచిత వసతి, పోషక విలువలతో కూడిన భోజనం, సురక్షితమైన వాతావరణం తదితర వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరిగింది.
జిల్లాలోని ఏడు కేజీబీవీల్లో 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఖాళీ సీట్ల కోసం బాలికలు అధికంగా పోటీ పడుతున్నారు. చిత్తూరు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయల్లో (కేజీబీవీ) 2008-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల పర్వం కొనసాగుతోంది. దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్ధన మేరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క కేజీబీవీలో 40 సీట్ల చొప్పున 280 సీట్లు ఇంటర్ మొదటి సంవత్సరం లో 40 సీట్లు చొప్పున 280 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి 6వ తరగతికి 393 దరఖాస్తులు. ఇంటర్ మొదటి సం వత్సరానికి 670 దరఖాస్తులు అందాయి. అడ్మిషన్లకు విద్యార్థులు (ఏపీకేజీబీవీ, ఏపీ సీఎఫ్ఎస్ఎస్.ఇన్) వెబ్ సైట్ ద్వారా మాత్రమే. దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందన్నారు ప్రిన్సిపాల్ అనిత తెలిపారు.
ఎంపికైన విద్యార్ధులకు వారి రిజిస్టర్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపుతారని తెలిపారు. ఎంపిక జాబితాను సంబంధిత పాఠశాలల నోటీసు బోర్డుల్లో ప్రదర్శిస్తారు. గడువు పొడిగివ్వడంతో మరో 2 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైన దరఖాస్తుల ఆధారంగా 6వ తరగతి, ఇంటర్‌లో ఒక్కో సీటుకు ఇద్దరు చొప్పున విద్యార్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలోని కేజీబీవీల్లో అడ్మిషన్లకు ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి.
ఇప్పటికే సీట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో ఎస్పీడీ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీ వరకు ‘దరఖాస్తులు చేసుకునేందుకు గడువు పెంచారు. కేజీబీవీల్లో నాణ్య మైన విద్యతో పాటు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. అర్హులైన బాలికలు ఆన్‌లైన్లలో దరఖాస్తు చేసుకుని, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏవైనా సమస్యలుంటే జిల్లా సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చని మద్దిపట్ల వెంకటరమణ, సమగ్రశిక్ష శాఖ వారు లోకల్ 18 కు సమాచారం ఇచ్చారు.
లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, లేటెస్ట్ కోర్సులు, స్కాలర్‌షిప్స్, విద్యకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తెలుసుకోండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



