Last Updated:
విశాఖపట్నంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, GVMC ఆధ్వర్యంలో మురళి బృందం మతిస్థిమితం లేని నిరాశ్రయులకు ఆశ్రయం, అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు చేస్తోంది
విశాఖపట్నంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) వారి ఆధ్వర్యంలో మతిస్థిమితం లేని నిరాశ్రయులకు ఆశ్రయం ఇస్తూ, అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు ” మురళీ (అండ్ అతని బృందం). రోడ్డు పక్కన ఎవరు మతిస్థిమితం లేకుండా తిరిగిన, వారిని తీసుకెళ్లి విశాఖపట్నం మానసిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి, ఆరోగ్యం నిలకడ అయిన తర్వాత విశాఖపట్నం చిన వాల్తేర్ లో ఏర్పాటు చేసిన భవనంలో ఉంచి సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. ప్రస్తుతం మతిస్థిమితం లేని వివిధ ప్రాంతాలు చెందినవారు 40 పైగా ఈ భవనంలో ఉన్నారు.
ఈ భవనంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి సైతం ఉన్నారు. పుట్టినరోజు పెళ్లిరోజు వేడుకలు తమ వద్ద జరుపుకుంటే పది మందికి అన్నం పెట్టిన వారవుతారు అంటూ ప్రజలకు ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. విశాఖపట్నంలోని 2017 నుండి జాతీయ పట్టణ జీవనోపాదుల మిషన్ (NULM), పట్టణ నిరాశ్రయుల వసతి గృహము, డోర్ నెం.4-21-34/1, దళాయ్ వారి వీధి 17వ వార్డు పెదవాల్తేర్ భవనం వద్ద మురళి ఈ సేవలు చేస్తున్నారు.
అనాథ వృద్ధులు లేదా రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతో మృతి చెందిన వారి మృతదేహాలను పోలీసుల సమాచారం మేరకు సొంత ఖర్చులతో అంబులెన్స్ ద్వారా తరలించి దహన సంస్కారాలు పూర్తి చేస్తున్నారు. అనాథ మృతదేహాలను తరలించడానికి దహన సంస్కారాలకు అయ్యే ఖర్చులను ఈ సంస్థ ప్రతినిధులు, దాతల సహకారంతో భరిస్తారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అనాథ మృతదేహాలు ఉన్నా, స్థానిక పోలీసులు వీరి సేవలను వినియోగించుకుంటారు. ఎవరైనా తమకు మిగిలిపోయిన ఆహారం ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్ 6300494020 కి ఫోన్ చేయాలని అంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా , కొవ్వూరు ప్రాంతానికి చెందిన సూర్యారావుకు కొడుకు, కూతురు ఉన్నప్పటికీ కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నాకు తిండి పెట్టడానికే వారికి ఇబ్బందిగా ఉంది. అందుకే ఇంటి నుంచి వచ్చేసాను. వేరొక మహిళ ద్వారా ఈ రెడ్ క్రాస్ సొసైటీకి రెండు సంవత్సరాలు ముందు వచ్చాను. ఇక్కడ నాకు అన్ని సదుపాయాలు చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్లాలని అనుకోవడం లేదు. ఆరోగ్యపరంగా , ఆహార పరంగా చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


