Last Updated:
Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన వ్యక్తిని బైకుపై ఆసుపత్రికి తరలించారు.
Viral Video: ఆంధ్రప్రదేశ్‌లో ఓ హృదయవిదారక సంఘటన అందర్ని కలచివేసింది. అన్నమయ్య జిల్లాలో 30 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు హుటాహుటిన కిందపడిపోయిన వ్యక్తిని బైకుపై ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లలోపే సదరు వ్యక్తి చనిపోయినట్లుగా డాక్టర్లు తేల్చి చెప్పారు. అయితే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలు ఎవరూ ముందుకురాలేదు. చివరకు ఆటో డ్రైవర్లు కూడా మృతదేహాన్ని తీసుకెళ్లమని చెప్పడంతో మృతదేహాన్ని బైకుపై కూర్చొబెట్టుకొని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈసంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనిషి చావు బ్రతుకుల మధ్యలో ఉంటే కూడా సహాయం చేయని జనం.. చివరకు చనిపోయిన తర్వాత కూడా కనికరం చూపకుండా మృతదేహాన్ని తీసుకెళ్లమని చెప్పడం మానవత్వానికే కళంకం తెచ్చేలా ఉందని అందరూ చర్చించుకుంటున్నారు.
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం ఎగువ మల్లెలవారిపల్లికు చెందిన వెంకటేష్ ఆదివారం గుండెపోటుకు గురయ్యాడు. 30 సంవత్సరాల వెంకటేష్‌కి హార్ట్ ఎటాక్ రావడంతో స్నేహితులు అతడ్ని బైక్‌పై కూర్చొబెట్టుకొని చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. అయితే చనిపోయినట్లుగా నిర్ధారణ కావడంతో వెంకటేష్ మృతదేహాన్ని తిరిగి స్వగ్రామమైన ఎగువ మల్లెలవారిపల్లికి తీసుకెళ్లేందుకు స్నేహితులు ప్రయత్నించారు. ఈక్రమంలోనే అక్కడున్న ఆటో డ్రైవర్లను కోరడంతో వాళ్లు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించారు.
వేరే దారి లేకపోవడంతో చనిపోయిన వెంకటేష్ మృతదేహాన్ని తమ బైక్‌పై మధ్యలో కూర్చొబెట్టుకొని ఒకరు బైక్ నడుపుతుంటే మరొక స్నేహితుడు శవం కిందపడిపోకుండా వెనుక కూర్చొన్నాడు. ఆదివారం సాయంత్రం అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి బంధువులకు అప్పగించారు స్నేహితులు. ఒక వ్యక్తి గుండెపోటుకు గురైతే అతడి ప్రాణాలు కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించారు. అయితే ప్రాణాలు కాపాడలేకపోయినప్పటికి అతడి మృతదేహాన్ని కూడా బైకుపై తీసుకు వచ్చి అంత్యక్రియలు పూర్తి చేయడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Andhra Pradesh



