Last Updated:
Hidden Shiva Temple: అందమైన, దట్టమైన అటవీ ప్రాంతం. అందులో 12వ శతాబ్దం నాటి శివలింగాకారం. ఇక ఆ లింగాకారం దర్శనం చేసుకుని బయటకు వచ్చామా,ఎంతో ప్రకాశవంతంగా కనిపించే నాగశిల, నిజానికి అద్భుతమైన చరిత్ర ఉన్న అతి పురాతన శివాలయంగా చెప్పుకోవచ్చు.
Hidden Shiva Temple: అందమైన, దట్టమైన అటవీ ప్రాంతం. అందులో 12వ శతాబ్దం నాటి శివలింగాకారం. ఇక ఆ లింగాకారం దర్శనం చేసుకుని బయటకు వచ్చామా,ఎంతో ప్రకాశవంతంగా కనిపించే నాగశిల, నిజానికి అద్భుతమైన చరిత్ర ఉన్న అతి పురాతన శివాలయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నిత్య అభిషేకం చేసిన శివలింగాకారంగా అక్కడ చరిత్ర చెబుతుంటే ఎంతో మంది ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటకు వచ్చేందుకు ఇక్కడ స్వయంభుగా ఉన్న నాగశిలను దర్శించుకుని అభిషేకం చేసిన తర్వాత విజయాలు వరించాయని మరొక చరిత్ర చెబుతుంది. ఇంతకీ అలాంటి అటవీ ప్రాంతంలో గల శివాలయం నాగశిల కొలువైన ప్రాంతం ఎక్కడుంది? అక్కడికి ఏ విధంగా వెళ్లాలి? ఒకసారి ఆ వివరాలు క్లుప్తంగా చూద్దాం.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం రంప గ్రామంలోని పురాతన శివాలయం ఇప్పటికి భక్తులు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేక ఆదరణకు నోచుకోవడం లేదు. 12వ శతాబ్దంలో చోళుల కాలంలో నాగవంశీయులచే ఈ గుడి నిర్మించినట్లుగా చెబుతారు. ఈ దేవాలయం, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. చుట్టూ దట్టమైన రంప అడవులు, జలపాతాల మధ్య ఈ ఆలయం ఉంటుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ గుడిలో ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు చేసినట్లుగా స్థానికులు, చరిత్రకారులు చెబుతారు. అంతే కాదు అక్కడ నాగుపాము రూపంలో ఉన్న లింగానికి అభిషేకం చేస్తే సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
రంపచోడవరానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం కొండపై కనిపిస్తుంది. ఆయితే ఈ గుడిని సిమెంట్, ఇటుకలు, ఇనుము లేకుండా కేవలం బండరాళ్లను ఒకదానిపై మరొకటి పేర్చి నిర్మించడం ఈ టెంపుల్ ప్రత్యేకత. ఈ ఆలయానికి భక్తులు రాక చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పూర్తి అటవీ మార్గం దాదాపు ప్రజలకు తెలియకపోవడం ఒక భయానక ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడికి రవాణా మార్గం ఏర్పాటు చేస్తే అతి ప్రాచీన ఆలయానికి భక్తుల రాకపోకలు పెరుగుతాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ పురాతన 12వ శతాబ్దం నటి ఆలయానికి వెళ్లాలి అంటే రాజమండ్రి నుంచి రంపచోడవడానికి చేరుకుని, రంపచోడవరం నుంచి రంప అడవిలోకి దాదాపు 5 కిలోమీటర్లు రహదారిపై ప్రయాణించిన తర్వాత, ఎడమవైపు మనకి ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మరొక నాలుగు కిలోమీటర్లు అటవీ మార్గంలోకి వెళితే రంప వాటర్ ఫాల్స్ దర్శనమిస్తుంది. మనకు ఎలాంటి వాటర్ లేదా పిల్లలకి పాలు ఆహారం కావాలన్నా ముందుగా రంపచోడవరంలో తీసుకోవలసిన అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు.
Rampachodavaram,East Godavari,Andhra Pradesh


