Heavy Rains in AP: గోదావరి జిల్లాల్లో వరుణుడి బీభత్సం.. చెరువులను తలపిస్తున్న రహదారులు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

Heavy Rains in AP: ఏపీలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, కాకినాడ నగరం సామర్లకోటలో రోడ్లు జలమయం, డ్రైనేజీలు మూసుకుపోయి మురుగు నీరు పొంగి, రైతుల ధాన్యం తడిసి నష్టం భయం

+

News18

News18

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆ జిల్లాలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలకు రోడ్లపై వర్షపు నీరు చెరువులు మాదిరిగా దర్శనమిస్తుంది. డ్రైనేజీలు సైతం నిండిపోవడంతో వీధులలో మురికి కోపాల నీరు పొంగి ప్రవహిస్తుంది, నిన్న మొన్నటి వరకు ఎండ దాటికి తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు వర్షం కొరవడంతో కాస్త ఉపశమనం చెందినప్పటికీ, వర్షం కాస్త అధికం కావడంతో కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అంతకుమించి ధాన్యం తడిసిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం అంతలా వర్షాలు ఎక్కడ కురుస్తున్నాయి. అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది. ఒకసారి క్లుప్తంగా చూద్దాం

ఏపీకి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు మధ్యాహ్నం దాటినప్పటికీ ఏకదాటిగా కురుస్తున్న పరిస్థితులు కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో నెలకొన్నాయి.

దీంతో కాకినాడ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపైనే నీరు నిలిచిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది, అదేవిధంగా రూరల్ ప్రాంతానికి సంబంధించి సామర్లకోట ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం ముఖ్యంగా నీరంతా రోడ్డుపైకి రావడంతో మురిగి కోపాల నీరు రోడ్లపైనే పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి సామర్లకోట సమీప ప్రాంతంలో కనిపిస్తుంది.

అదే విధంగా రూరల్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి పంట పొలాల్లో ఉన్న ధాన్యం తడిసిపోతున్న పరిస్థితి నెలకొంది దీంతో ప్రత్యేక డేరాలు పెట్టి ధాన్యం తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అకాల వర్షాలు కాస్త ప్రజలను ముఖ్యంగా రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం, రాజోలు, పి గన్నవరం ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుంది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయంగా మరాయి.

ఏది ఏమైనా నిన్నమొన్నటి వరకు భానుడి ప్రతాపానికి ఇబ్బందులు పడ్డ ప్రజానికం గోదావరి జిల్లాలో వర్షం నేపథ్యంలో హమ్మయ్య చల్లబడింది వాతావరణం అంటూ వృద్ధులు ముఖ్యంగా ఉపశమనం చెందుతున్నారు. అయితే గత ఏడాది మే మాసంలో సైతం ఇదేవిధంగా వర్షాలు కురిసిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది అలాగే కురుస్తాయా లేక మరలా బానుడు ప్రతాపం కొనసాగుతుందా అన్నది చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *