Gangamma Jathara: స్టేట్‌లో ఇదే వెరైటీ జాతర.. పుష్ప2 సినిమా స్టైల్లో ఉంటది | చిత్తూరు వార్తలు (Chittoor News)


Last Updated:

Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది.

+

Gangamma

Gangamma Jathara

Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. జాతర సమయంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు 14 రోజుల పాటు కుల వృత్తుల వాళ్లు చేసే అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు మరెక్కడ జరగవు. ఇక్కడ జరిగే విశ్వరూప దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. పలమనేరు పట్టణంలో ఏ పూర వీధి చూసినా జన సమూహంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. అన్ని కుల సంఘాలు స్వచ్చంధంగా పాల్గొని  అమ్మవారి సేవా కార్యక్రమాల్లో విధిగా సేవలు అందిస్తారు.

స్టేట్‌లోనే ఇదో వెరైటీ జాతర..

పలమనేరు గంగమ్మ జాతర అంటే రాయలసీమ ప్రాంతంలో జరిగే ఉత్సవాలు, వేడుకల్లో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. మత్స్యకారులు, కులసంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ 18 రోజుల పాటు గంగమ్మ జాతర జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి రోజుకోక్క అలంకరణతో ముస్తాబు చేసి , భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక్కడ చాటింపుతో మొదలు పెడితే అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలు, వస్త్రాల వరకు జాతర కోలాహలంగా జరుగుతుంది. ఈ జాతరను చూడటానికి అశేష జన సమూహం గుమికూడుతుంది. ఇక్కడ ప్రత్యేకతలు ఏమంటే జాతర జరిగే అన్ని రోజులు రోజుకు రెండు కులాలు చొప్పున ఇలా 28 కులాలు పాల్గొని స్వామి వారి సేవకు ఉభదారులగా వ్యవహరిస్తారు.

అక్కచెల్లెళ్లకు మొక్కులు..

గంగమ్మ సోదరి మరెమ్మ ఆలయంలో పొంగళ్లు పెట్టి ఆ నైవేద్యాన్ని గంగమ్మకు పెట్టి దర్శించుకొంటే అన్ని శుభాలే వరిస్తాయన్నది ఇక్కడ భక్తుల విశ్వాసం నమ్మకం. ఈ నెల 30 వ తేది గంగ చాటింపుతో జాతర మొదలై మే 18 వ తేదీ అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు వేలంతో ముగియనున్నది. గంగమ్మ సోదర మారెమ్మ తల్లి దేవాలయం నందు పొంగళ్ళు పెట్టి ఆతల్లికి నైవేద్యం సమర్పించి అనంతరం గంగమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకుంటారు భక్తులు. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ఇది. జాతర జరిగే మునుపు ప్రాణాళికగా ఆలయ ఛైర్మన్, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కుల సంఘ నాయకులు కలిసి జాతర జరిగే ప్రణాళికపై చర్చించుకొంటారు.

పుష్ప సినిమా స్టైల్లో ఉంటది..

ఇదే దిశలోనే పలమనేరు తిరుపతి గంగమ్మ జాతర  మొదలు పెట్టడానికి ఆలయాన్ని శుద్దికరణ చేసి, పసుపు నీళ్లతో సంప్రోక్షణ చేశారు. ఈ నెల 30 న చాటింపు తో మొదలు పెడతారు.14 వ తేదీ రాత్రి అమ్మవారి ఊరేగింపు, 15 అమ్మవారి విశ్వరూప దర్శనం, 16 వ తేదీ జలది ఊరేగింపు, జలది వేడుకలు జరుగుతాయి.17,18 వ తేదీ అమ్మవారి ఆలయంలో వేలంపాటు కార్యక్రమం నిర్వహిస్తారు. జాతరలు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. కానీ పలమనేరు తిరుపతి గంగమ్మ జాతరలో సోదరి మరెమ్మ దర్శనం అనంతరమే గంగమ్మ దర్శనం. చిత్తూరు జిల్లాలో సంవత్సరం పొడవునా జాతరలు జరుగుతూనే ఉంటాయి.అది కూడా పెద్దల కాలం నుండి వచ్చే సంస్కృతి,సంప్రదాయం ,ఆచార అలవాట్లు క్రమం ప్రకారమే జరుగుతాయి. కానీ పూర్వం నిర్ణయించిన నెలల ప్రకారమే ఈ జాతర్లు నిర్వహిస్తారు. ఇదే క్రమంలోనే తిరుపతి గంగమ్మ జాతర కూడా ఈ నెలలోనే మొదలు పెడతారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *