తిరుమలలో ఇంధన కొరత పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి అక్కడి పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ మరియు డీజిల్ నిల్వల పరిస్థితి, సరఫరా అంతరాయం కారణాలు, భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయా బంకుల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇంధన నిల్వలను సమర్థవంతంగా వినియోగించేందుకు తాత్కాలిక పరిమితులు కూడా అమలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి 1 లీటర్, కార్లు, జీపులు, టెంపో ట్రావెలర్లకు గరిష్టంగా 5 లీటర్ల చొప్పున మాత్రమే ఇంధనం అందిస్తున్నారు.
Source link


