Last Updated:
Crime News: విశాఖపట్నం మధురవాడలో ఐదేళ్ల వివాహేతర సంబంధం వివాదంగా మారి, కొయ్య కార్తీక్ ప్రియురాలిని తీగతో చంపేందుకు ప్రయత్నం, ఆమె ప్రాణాలతో బయటపడగా కార్తీక్ అరెస్ట్
అనుమానం పెనుభూతమై ఐదేళ్లుగా కొనసాగుతున్న ఒక వివాహేతర సంబంధాన్ని బలితీసుకోవడానికి కారణమైంది. తన ప్రియురాలు వేరొక యువకుడితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో, ఆమెను అంతమొందించాలని పథకం పన్నిన ఒక ప్రియుడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పదునైన తీగతో గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించిన వివరాలను భీమిలి పోలీసులు గురువారం మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం మధువిశాఖలో వివాహేతర సంబంధంో అనుమానంతో ప్రియురాలిపై హత్యాయత్నంరవాడ వైఎ స్మార్ నగర్‌కు చెందిన ఒక వివాహిత (32) ఒక బంగారు దుకాణంలో పనిచేస్తోంది. అదే ప్రాంతంలోని స్వతంత్రనగర్‌కు చెందిన కొయ్య కార్తీక్ (32) భవనాల సీలింగ్ పీవోపీ (POP) పనులు చేస్తుంటాడు. వీరిద్దరూ గతంలో ప్రేమించుకున్నారు. అయితే పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో, ఎవరికి వారు వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు.
పెళ్లిళ్లయి జీవిత భాగస్వాములు ఉన్నప్పటికీ, వారికెవరికీ తెలియకుండా కార్తీక్, సదరు వివాహిత గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, గత కొద్ది నెలలుగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సదరు వివాహిత తను పనిచేసే చోట మరొక యువకుడితో చాలా సన్నిహితంగా ఉంటోందని ప్రియుడు కార్తీక్ గమనించి, ఆమెపై తీవ్రమైన ద్వేషాన్ని, అనుమానాన్ని పెంచుకున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరగ్గా, ఎవరికి వారు పంతానికి పోయారు. దీంతో ఆమెను ఎలాగైనా అంతమొందించాలని కార్తీక్ ఒక పక్కా ప్లాన్ వేశాడు.
పథకం ప్రకారం.. మంగళవారం రాత్రి కార్తీక్ ఎప్పటిలాగే నమ్మకంగా ప్రియురాలికి కబురు పంపి, బైక్‌పై బయటకు తీసుకువచ్చాడు. రాత్రి వేళ మధురవాడ – కాపులుప్పాడ రోడ్డులోని గ్రేహౌండ్స్ సమీప కొండ ప్రాంతంలో ఉన్న ఒక చీకటి, నిర్మానుష్య ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లాడు.
అక్కడ ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరగ్గా.. ముందే తన వెంట తెచ్చుకున్న పదునైన తీగను ఆమె మెడకు బిగించి గట్టిగా లాగాడు. బాధితురాలు ఊపిరాడక కేకలు వేస్తూ విలవిలా కొట్టుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతం కటిక చీకటిగా ఉండటంతో ఆమె చనిపోయిందని భావించిన కార్తీక్, మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఏమీ తెలియనట్లు పరారయ్యాడు.
నిందితుడు కార్తీక్ తాను చేసిన ఘోరాన్ని ఫోన్ ద్వారా తన స్నేహితుడికి చెప్పడంతో, ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన భీమిలి పోలీసులు మంగళవారం రాత్రంతా ఆ కొండ ప్రాంతంలో గాలించినా చీకటి కారణంగా ఆమె ఆచూకీ దొరకలేదు. బుధవారం ఉదయాన్నే మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా.. ప్రాణాపాయ స్థితిలో అచేతనంగా పడి ఉన్న బాధితురాలిని గుర్తించారు. వెంటనే ఆమెను రుషికొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
ఘటన అనంతరం కొండల ప్రాంతంలోనే దాక్కున్న నిందితుడు కార్తీక్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు, శుక్రవారం ఉదయం అతడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. సీపీ ఆదేశాల మేరకు నిందితుడిపై శాశ్వతంగా రౌడీషీట్ తెరుస్తున్నట్లు భీమిలి పోలీసులు ప్రకటించారు. నిందితుడు నేరానికి ఉపయోగించిన ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్లు, గొంతు నులమడానికి వాడిన తీగను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



