Last Updated:
చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా కదిరి ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతం, ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి తెలిపారు
దేవాలయాల్లో పూజలు రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం. సేవా కార్యక్రమాలు అన్నదానం, పండ్లు పంపిణీ చేయడం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం. నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలు భారీ కేకులను కట్ చేసి సంబరాలు జరుపుకోవడం మాములే చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు పార్టీ శ్రేణుల మధ్య చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి.
76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ 76 టెంకాయలు కొట్టడం అనేది ఒక విశేషమైన భక్తిపూర్వక సంఘటన శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో జరిగింది సీఎం నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహణ 76వ పుట్టినరోజు సందర్భంగా 76 టెంకాయలు కొట్టి డిప్యూటీ సీఎం ఆరోగ్యం బాగుండాలని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామికి టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు.
శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో ఉన్నటువంటి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 76 సంవత్సరాలు పుట్టినరోజు సందర్బంగా 76 టెంకాయలు కొట్టడం ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే డిప్యూటీ సీఎం ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక చికిత్స చేయించుకోవడంతో పాటు ఆయన ఆరోగ్యం బాగుండాలని పూజలు నిర్వహించడం జరిగిందని స్థానిక నాయకులు కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి శనివారం (ఏప్రిల్ 18) సాయంత్రం ఒక శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భార్య అన్న లెజినోవా సోదరుడు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గత శుక్రవారం ఒక అధికారిక సమీక్షా సమావేశంలో ఉండగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరగా, ఎంఆర్ఐ (MRI) వంటి పరీక్షల అనంతరం శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు నిర్ణయించారు. ఆపరేషన్ తర్వాత ఆయనకు 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సినీ రంగ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana


