విజయ్-రష్మికపెళ్లి ముహూర్తం ఖరారు

హైదరాబాద్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నల పెళ్లి గురించి కొన్నాళ్లుగా వరుస వార్తలు వైరల్ అవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సారి ఏకంగా వారి వివాహ నిశ్చయ తాంబూలాల ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వెడ్డింగ్ కార్డ్ ప్రకారం, వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక ప్రైవేట్ వేడుకగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల కోసం…

Read More

‘ఫౌజీ’ షూటింగ్‌లోప్రభాస్‌కు స్వల్ప గాయాలు – Visalaandhra

హైదరాబాద్: హను రాఘవపూడి దర్శ కత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీక రిస్తుండగా గుర్రం నుంచి అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డాడు. దీంతో చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియ గానే అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఇది చిన్న గాయమేనని, ప్రభాస్ త్వరలోనే కోలుకుని షూటింగ్ కొనసాగిస్తా రని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ…

Read More

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ-దిశ

ప్రజా సాధికారత, సంపద సృష్టే లక్ష్యం. బిల్ గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలుపై గేట్స్ ప్రశంస. డిజిటల్ విప్లవంలో సీఎం పాత్ర కీలకమంటూ కితాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకు ఇది…

Read More

మొబైల్ రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదని … మనస్తాపంతో పురుగుల మందు తాగి యువకుడు మృతి

విశాలాంధ్ర, డీ.హి.రేహాల్.. మండలం లోని కల్యాం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ రీఛార్జ్ కోసం డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో 17ఏళ్ల బాలుడు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు నవీన్ (17) ఉన్నారు. కుటుంబం వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. నవీన్ కూడా తల్లిదండ్రులతో కలిసి పొలం పనుల్లో చేస్తూ జీవనం కొనసాగించేవాడు.ఇటీవల తన మొబైల్ రీఛార్జ్ చేయించుకోవడానికి డబ్బులు కావాలని నవీన్…

Read More

జీహెచ్‌ఎంసీ : ఐటీ కారిడార్ ట్రాఫిక్‌కు చెక్‌: రూ.800 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్

హైదరాబాద్ లోని ఐటీ కారిడార్‌లో వాహనదారులకు రోజూ తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌ను సిగ్నల్‌ ఫ్రీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బహుళస్థాయి ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను వేగంగా కొనసాగిస్తోంది.ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్‌ను నిర్మిస్తుండగా, ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ, విప్రో జంక్షన్ల వద్ద రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం…

Read More

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్‌మెంట్లు డాలర్లలో నిర్వహించేందుకు రష్యా సిద్ధమవుతుండడం బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర సోమవారం గ్రాముకు రూ.1300కు పైగా తగ్గింది. ఈ…

Read More

ఆంజనేయస్వామి దేవాలయానికి టీడీపీ నేత విరాళం

విరాళం అందజేస్తున్న టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర-పెద్దకడబూరు :(కర్నూలు) మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణానికి శనివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి 10,016 రూపాయలు ఆలయ ధర్మకర్త నల్లారెడ్డికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయం చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నరసింహులు, గ్రామ పెద్దలు ఎంజీ నరసన్న,…

Read More

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం – Visalaandhra

–విహారానికి వెళుతుండగా విషాదం చెన్నూరు-కడప జిల్లా: విద్యార్థులు విహారానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన వైఎస్సార్‌ కడప జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఏర్పేడు మండల పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్‌)లో వైజాగ్‌కు చెందిన ఠాగూర్‌రెడ్డి, కేరళకు చెందిన అనుగ్రహ, రుషికా(23), అఖిల్, సుషీన్, భవ్యలు విద్యనభ్యసిస్తున్నారు. శనివారం ఉదయం వీరందరూ రెండు ద్విచక్ర వాహనాలపై తిరుపతి నుంచి గండికోటకు బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం…

Read More

24 ఏళ్లకే కౌన్సిలర్‌ – Visalaandhra

–బిఆర్ఎస్ నుంచి ఎన్నికైన రమ్య స్టేషన్‌ఘన్‌పూర్‌ : స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 24 ఏళ్ల వయస్సులోనే కౌన్సిలర్‌గా ఎన్నికై అందరితో ఔరా అనిపించుకుంటున్నారు చల్లా రమ్య. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా.. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఐదో వార్డు జనరల్‌ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తరఫున రమ్య పోటీచేసి.. కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెను పట్టణ వాసులు అభినందిస్తున్నారు. Source link

Read More

అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగలడు : హర్భజన్ సింగ్

క్రీడలు: క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ కోసం భారత్ పాకిస్తాన్లు సిద్ధమయ్యాయి. చిరకాల ప్రత్యర్థుల ఆటను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్ ఒక టాక్ షోలో మాట్లాడుతూ ‘అభిషేక్’ సాంకేతికంగా అంత గొప్ప బ్యాటర్ కాదని వ్యాఖ్యానించాడు. దీనిపై హర్భజన్ సింగ్ స్పందించారు. అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగల పరిపూర్ణ బ్యాటర్ అన్నాడు. బంతి ఎలా వస్తుందో ఎలా షాట్ ఆడాలో తెలిసిన తెలివైన ఆటగాడు అన్నాడు. లాంగాన్,…

Read More