7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం ఏడు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.దిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.రాష్ట్రంలో ఏఐ, క్వాంటమ్ అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయని ప్రభుత్వం…


