నేడే టీ 20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్

-ఇంగ్లాండ్ ను ఢీకొంటున్న భారత్ ముంబై: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కఠిన సవాల్‌కు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను టీమ్‌ఇండియా ఢీకొట్టనుంది. రెండు జట్లు సెమీస్‌ చేరిన తీరు భిన్నం. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచినా.. సాధికారిక ప్రదర్శన చేయలేకపోయింది. సూపర్‌-8లో తడబడింది. దక్షిణాఫ్రికా చేతిలో పరాభవంతో గట్టి పరీక్షను ఎదుర్కొంది. చివరికి క్వార్టర్‌ఫైనల్‌ లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి ముందంజ వేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్‌ మంచి ఫామ్‌లో…

Read More

22 ఏ ని తొలగించి షేధిత జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ చేయించండి

-ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు విశాలాంధ్ర- ధర్మవరం: రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, నెల కిందట ముదిగుబ్బలో ఇచ్చిన హామీ మేరకు 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించి అవి తక్షణమే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ నాయకులు మండల తహసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. అనంతరం ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ మండలంలో…

Read More

పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్‌రూం

-అందుబాటులో హెల్ప్‌లైన్‌ నంబర్లు న్యూదిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధం కొనసాగుతుండటంతో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారత పౌరులు చిక్కుకుపోయారు. వీరికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూంని ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కంట్రోల్‌ రూం అందుబాటులో ఉంటుందని తెలిపింది. 1800 118797 టోల్‌ఫ్రీ నంబరును గానీ, ం91 11 2301 2113,…

Read More

భారత్ పోర్టులు అమెరికా వినియోగించుకోలేదు

– కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడి న్యూదిల్లీ : ఇరాన్ పై దాడి కోసం భారత కోర్టులను అమెరికా వినియోగించుకుంటుందని అమెరికా మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ నిరాధార వార్తలంటూ భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. యూ ఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రేగోర్ అమెరికా మీడియా ఛానల్ లో మాట్లాడుతూ… తమ బేస్…

Read More

దుబాయ్ లో ఉన్నవారికి సాయం అందిస్తాం : సోనూసూద్

న్యూదిల్లీ : రియల్ హీరో సోను సూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. దక్షిణాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుబాయ్ లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం ఆయన సాయం చేయనున్నట్లు తెలిపారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో అక్కడ విమాన సర్వీసులు రద్దయిన విషయం విధితమే. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటాననే విషయాన్ని మరొక్కసారి ఆయన రుజువు చేసుకున్నారు. ఎటువంటి షరతులు లేవని, ఏ దేశస్తులైనా ఉచితంగా బస చేయవచ్చని చెప్పారు….

Read More

పోరు…హోరు

ఇరాన్ ప్రతిదాడులు తీవ్రతరం . గల్ఫ్ లక్ష్యాలపైకి క్షిపణులు, డ్రోన్లు. లెబనాన్‌లో ఐడీఎఫ్ భూతల దాడులు. ఐదు రోజుల్లో 1,045 మంది మృతి. వారంలోగా ఇరాన్ గగనతలం స్వాధీనం: అమెరికా. ఒకట్రెండు వారాల్లో లక్ష్యాలన్నీ ధ్వంసం: ఇజ్రాయిల్ తెహ్రాన్: క్షిపణలు, బాంబులతో పశ్చిమాసియా మండుతోంది.అటు అమెరికాఇజ్రాయిల్, ఇటు ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పరస్పర దాడులతో భీతావహం సష్టిస్తున్నాయి. అమెరికాఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ ప్రతి దాడులు చేయడంతో పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. యుద్ధం…

Read More

రూపాయి విలువ మరింత క్షీణత – Visalaandhra

న్యూదిల్లీ: ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ భయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోవడంతో సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరిలోనూ ఆందోళన మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది. చరిత్రలో మొదటిసారిగా రూపాయి విలువ 92 మార్కును దాటి పడిపోయింది. యుద్ధం కారణంగా ముడి…

Read More

సీఎం నితీశ్ రాజీనామా?

పట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నితీశ్‌కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జాతీయమీడియా కథనాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం దిల్లీ నుంచి పట్నాకు వచ్చి… నితీశ్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్‌సింగ్) కూడా దిల్లీ నుంచి పట్నాకు…

Read More

ఎస్‌హెచ్‌జీ మహిళల ఆరోగ్య వివరాల సేకరణ

. 46 లక్షల మందికి 30 రకాల పరీక్షలు. ఈ నెల 8 నుంచి ప్రారంభం. 4 దశల్లో ఆరోగ్యశాఖ కార్యక్రమాలు విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాక సంఘాల మహిళల ఆరోగ్య వివరాలు (హెల్త్ ప్రొఫైల్) నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రారంభించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సెక్రటేరియట్‌లో మంత్రి…

Read More

ఐఏఎస్, ఐపీఎస్‌లను మారిస్తే ఫలితాలు రావు

. కీలకశాఖల అధికారుల మార్పుతో రాష్ట్రానికి నష్టం. రేవంత్ మేనల్లుడి మనుషులు అక్రమ మైనింగ్. దందా నడుపుతున్న మంత్రి పొంగులేటి సంస్థ. నేడు మైనింగ్ ప్రాంతాలకు నిజనిర్ధారణ కమిటీ: హరీశ్ రావు విశాలాంధ్ర – హైదరాబాద్ : ఐఏఎస్, ఐపీఎస్‌లను తరచూ మార్చడం వల్ల ఫలితాలు రావని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఐదుసార్లు భారీగా మార్పులు చేర్పులు జరిగాయన్నారు. మీడియాతో బుధవారం ఆయన ఇష్టాగోష్ఠిగా…

Read More