విద్యతోపాటు పారిశ్రామిక సంస్థల ఏర్పాటుపై అవగాహన

విశాలాంధ్ర-రాప్తాడు : ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతోపాటు పారిశ్రామిక సంస్థలను సందర్శించి అందులో ఉత్పత్తి అయ్యే వాటిపై కూడా అవగాహన పెంచుకోవాలని కళాశాల ఎం.డి. వెన్నెపూస రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. విష్ణువర్ధన్ సూచించారు.హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు బుక్కరాయసముద్రం పరిధిలోని 220కేవీ, 132కేవీ, 33కేవీ, 11కేవీ సబ్‌స్టేషన్లను సందర్శించారు. కళాశాల కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ, చైర్మన్ బి.వి. కృష్ణా రెడ్డి,…

Read More

22ఏ భూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

. మార్చి నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి. కోర్ట్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి. రెవిన్యూ కార్యక్రమాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్ష విశాలాంధ్ర – ఏలూరు : జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి అందిన విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ గౌతమీ సమావేశమందిరంలో శుక్రవారం 22ఏ భూ సమస్యల పరిష్కారం,…

Read More

దాతల సహకారంతోనే ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు..

-శ్రీ సత్య సాయి సేవా సమితి విశాలాంధ్ర ధర్మవరం; దాతల సహకారంతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి పిఆర్టి సర్కిల్ ధర్మవరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు బిస్కెట్లను 150 మందికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ అల్పాహార సేవా కార్యక్రమానికి దాతగా పెనుకొండ వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ…

Read More

బొత్సకు మళ్లీ అస్వస్థత…

శాసనమండలిలో ప్రసంగిస్తుండగా బొత్సకు అస్వస్థత వెంటనే మండలికి చేరుకుని పరీక్షలు చేసిన వైద్యులుప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లువైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు.బొత్స ఇబ్బందిని గుర్తించిన మంత్రి పయ్యావుల.. ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని…

Read More

పురపాలక సంఘ బకాయిలను చెల్లించండి – Visalaandhra

పురపాలక సంఘ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 40 వార్డులలో గల ప్రజలు పురపాలక సంఘ బకాయిలను చెల్లించి సహకరిస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని పురపాలక సంఘ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములో పలుచోట్ల బకాయిలు గల వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, దీంతోపాటు వారు తిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు థియేటర్లు, పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలు, దీర్ఘకాలిక బకాయిలు ఉన్న ఇళ్ల వద్దకు…

Read More

న్యూయార్క్ మేయర్‌నే నియమించలేని ట్రంప్ ఇరాన్ లీడర్‌ను నియమిస్తారా?

: ఇరాన్ మంత్రి చురకఇరాన్‌లో పాలన మార్పుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవడంలో తన పాత్ర ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ సహాయమంత్రి సయ్యద్ ఖతిబ్జాదే తీవ్రంగా స్పందించారు. ట్రంప్ తన దేశంలోని న్యూయార్క్ మేయర్‌ను కూడా నియమించలేడని, అలాంటిది ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇటీవల మమ్దానీ ఎన్నికైన విషయాన్ని…

Read More

త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాను: తిరుమలలో కవిత

భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కవిత త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలలో వెల్లడించారు. తన భర్తతో కలిసి కవిత శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ, నాలుగేళ్లుగా తాను పడుతున్న మనోవేదన వెంకటేశ్వరస్వామి వారి దయతో తీరిందని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారి మొక్కులు చెల్లించడానికి కాలినడకన వచ్చానని తెలిపారు. కవిత…

Read More

తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు..

ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీములుగు జిల్లాలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న‌ ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్,…

Read More

వయసును బట్టి హేళన చేయడం సరికాదు

తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన అనసూయ హైదరాబాద్: ఇటీవల యాంకర్, నటి అనసూయ హోలీ సంబరాల్లో పాల్గొన్న విషయం తెలిసినదే. ఆ సంబరాల్లో ఆమె మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ‘ఆంటీ’ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కొందరు ఆ వీడియోకు వచ్చిన కామెంట్స్ తో రీల్స్ చేయడం ప్రారంభించారు. ఆ రీల్స్ పై ఆమె పోస్ట్ పెట్టారు… ” ఇతరుల బాధలో కూడా వినోదం వెతికే వారిని, కనీస సానుభూతి,…

Read More

కూలిన సుఖోయ్ ఫైటర్ జట్ లో పైలెట్లు మృతి

న్యూదిల్లీ : భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం గల్లంతయిన సంగతి విధితమే. ఆ ఫైటర్ జెట్ కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి ఈ యుద్ధ విమానం గల్లంతయింది. రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టగా, స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు గుర్తించారు. ఈ…

Read More